గ్రహాంతర వాసులారా! ఆర్ యూ దేర్?

By సుభాష్  Published on  17 Feb 2020 2:54 PM GMT
గ్రహాంతర వాసులారా! ఆర్ యూ దేర్?

శాస్త్రవేత్తలు గ్రహాంతర వాసుల కోసం ఇప్పుడు రాత్రంతా వెతుకులాట ప్రారంభించబోతున్నారు. రాత్రి వేళల ఆకాశం నుంచి అంతరిక్షం నుంచి గ్రహాంతరవాసులు ఏవైనా సిగ్నల్స్ పంపుతున్నారా అన్న విషయంపై ఇప్పుడు ఏకంగా 28 రేడియో టెలిస్కోపులు పెట్టుకుని మరీ ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలోని న్యూ మెక్సికోలో ఈ తరహా పరిశోధనలు జరగబోతున్నాయి. న్యూ మెక్సికో లోని టేరి ఇన్స్ టిట్యూట్ వారు వారి వద్ద ఉన్న వెరీ లార్జ్ అర్రే (వీ ఎల్ ఏ) లబరేటరీ తో కలిసి ఈ పరిశోధనలు చయబోతున్నరు. వీ ఎల్ ఏ సేకరించబోయే డేటా గ్రహాంతర వాసులు పంపే సందేశాలను గుర్తించి, వారితో సంభాషించే ప్రయత్నాలు చేయడానికి ఉపయోగపడుతుంది.

ఇంత కాలం గ్రహాంతర వాసుల కోసం జరిగే పరిశోధనలను శాస్త్రవేత్తల సముదాయం అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు దీనిని పట్టించుకుని వివిధ రంగాలతో సమన్వయంచేసుకుని పని చేయడం మొదలైంది. అంటే గ్రహాంతరవాసుల పై జరిగే పరిశోధనలకు ఒక గుర్తింపు వచ్చినట్టయింది. అంతరిక్షం నుంచి వినిపించే బీప్ సౌండ్లు, కూ అన్న శబ్దాలు ఇతర మెసేజీలను గుర్తించేందుకు ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిని అంతరిక్ష గ్రహాంతర వాసులు పంపించే టెక్నో సిగ్నేచర్స్ గా భావిస్తారు.

ఈ విశ్వ బ్రహాండంలో మనమొక్కరమే జీవులమా లేక ఇతర గ్రహాల్లో ప్రాణులు ఉన్నారా , వారి మేథస్సు ఏ విధంగా ఉంటుంది వంటి ప్రశ్నలకు కూడా జవాబులు వెతికేందుకు ఈ పరిశోధనలు ఉపయోగపడతాయి. ఈ పరిశోధనల్లో టెలిస్కోపులు, రేడియో సిగ్నల్స్ ను పసిగట్టే పరికరాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పటి వరకూ సైంటిఫిక్ ఫిక్షన్ గా భావించిన ఈ శాస్త్రం ఇప్పుడిప్పుడే అబద్ధం కాదని, ఇందులో ఎంతో కొంత నిజం ఉందని శాస్తరవేత్తలు భావిస్తున్నారు.

1995 లో తొలిసారి మన గ్రహమండలానికి చెందని, దానికి ఆవల ఉన్న ఒక వేరే గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి గాను శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతిని కూడా ఇవ్వడం జరిగింది. ఆ తరువాత నుంచి జరిగిన పరిశోధనల్లో ఇలాంటి 4000 గ్రహాలను కనుగొనడం జరిగింది. ఈ తరువాత ఎక్స్ ట్రీమో ఫైల్స్ అనే జీవాలను కనుగొనడం జరిగింది. ఇవి అత్యంత కఠినాతికఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ జీవించగలుగుతాయి. ఇలాంటి గ్రహాంతర జీవులను కనుగొనడంతో గ్రహాంతర వాసుల గురించి కొత్తగా ఆసక్తి పెరిగింది. సీరియస్ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. కాలిఫోర్నియాలోని సెటి ఇన్స్ టిట్యూట్, వీ ఎల్ ఏ, వంటి సంస్థల పరిశోధనలు కూడా వేగవంతం అయ్యాయి. గత అక్టోబర్ లో ట్రాన్సిటింగ్ ఎక్జో ప్లానెట్ సర్వే సాటిలైట్ (టెస్) కొన్ని వింత శబ్దాలను కనుగొన్నది. ఏ గ్రహాల్లో జీవులు ఉండవచ్చు? అవి మనుషులతో సంభాషించగలవా? అవిపంపే సిగ్నల్స్ మనకు అందుతాయా, అర్థమౌతాయా? ఈ ప్రశ్నలకు కూడా ఈ పరిశోధనల వల్ల జవాబులు దొరకవచ్చు.

Next Story