అమెరికాలో 11 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్‌

By సుభాష్  Published on  23 Oct 2020 10:56 AM GMT
అమెరికాలో 11 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్‌

అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న 11 మంది భారతీయులతో సహా 15 మంది విదేశీ విద్యార్థులను ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. యూఎస్‌ ఇమిగరేషణ్‌ అధికారులు ఇచ్చిన సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బోస్టన్‌, వాషింగ్టన్‌, హ్యూస్టన్‌, నెవార్క్‌, నాష్విల్లే, పిట్స్‌బర్డ్‌, హ్యారిస్‌బర్డ్‌ ప్రాంతల నుంచి వీరిని అరెస్టు చేశారు.

వీరంతా ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ అనే వెసులుబాటుని ఉపయోగించుకుని అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నట్లు ఇమ్మింగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆరోపించారు. విద్యార్థులు చదివిన రంగంలో ఒక ఏడాది పాటు పని చేసే అవకాశం ఓపీటీ కల్పిస్తోంది. స్టెమ్‌ ఓపీటీలో పాల్గొన్నట్లయితే మరో 24 నెలలు నివాసం ఉంటున్నారరని అధికారులు గుర్తించారు.

Next Story