భారత నేవీలో స్మార్ట్‌ఫోన్‌లు, ఫేస్‌బుక్‌ వాడకం నిషేధం..!

By Newsmeter.Network  Published on  30 Dec 2019 4:27 AM GMT
భారత నేవీలో స్మార్ట్‌ఫోన్‌లు, ఫేస్‌బుక్‌ వాడకం నిషేధం..!

విశాఖ: భారత నేవీ కీలక నిర్ణయం తీసుకుంది. సిబ్బంది స్మార్ట్‌ఫోన్‌లు, ఫేస్‌బుక్‌ వాడకాన్ని నేవీ నిషేధించింది. నేవీ స్థావరాలు, డాక్‌యార్డ్‌, ఆన్‌బోర్డు యుద్ధనౌకల దగ్గర నిషేధం విధిస్తున్నట్టు అధికారులు ప్రకటన జారీ చేశారు. కాగా సోషల్‌ మీడియా ద్వారా సమాచారాన్ని లీక్‌ చేస్తున్న ఏడుగురు నేవీ సిబ్బందిని అరెస్ట్‌ చేసిన తర్వాత అధికారులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల నేవీకి చెందిన ఎనిమిది మంది సిబ్బంది శత్రు దేశమైన పాకిస్థాన్ తో చేతులు కలిపి గూఢ చర్యం చేస్తున్నారని, మన దేశానికి సంబంధించిన సీక్రెట్లను శత్రు దేశానికి చేరవేస్తున్నారన్న అనుమానంతో వారందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. కాగా ఇప్పటికే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐకు నిఘా సమాచారం చేరవేస్తున్న భారత నావికదళం ఉద్యోగుల కేసులో ఎన్‌ఐఏ విచారణ వేగవంతం చేశారు. ప్రస్తుతం విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు రిమాండ్‌లో ఏడుగురు నిందితులు ఉన్నారు. జనవరి 3తో నిందితుల రిమాండ్‌ గడువు ముగియనుంది. ఈ కేసులో మరింత సమాచారం కోసం ఎన్‌ఐఏ అధికారులు కూపీ లాగుతున్నారు.



Next Story