గరిక అంటే వినాయకుడికి ఎందుకు ఇష్టం..? గరిక లేనిది వినాయకుడికి లోటేనట!

By సుభాష్  Published on  23 Aug 2020 4:06 AM GMT
గరిక అంటే వినాయకుడికి ఎందుకు ఇష్టం..? గరిక లేనిది వినాయకుడికి లోటేనట!

వినాయకుడిని గరికతో పూజ చేస్తే సర్వ శుభములు చేకూరుతాయి. వినాయకునికి గరికపోచలంటే ఎంతో ఇష్టం. ఎన్నిరకాల పత్రాలు, పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేకుండా విఘ్నేశ్వరుడు లోటుగా భావిస్తాడు. గరికెలు లేని వినాయక పూజ వ్యర్థమని, ప్రయోజన రహితమని పురోహితులు చెబుతున్నారు.

పురాణాల ఆధారంగా….అసలు వినాయకుడికి గరిక అంటే ఎందుకు ఇష్టమో చూద్దాం….పూర్వంలో అనలాసురుడు అనే రాక్షసుడు నిప్పును పుట్టించి లోకాన్నంత దహించసాగాడట. అయితే దేవతలంతా వినాయకుడి దగ్గరకు వచ్చి తమను రాక్షసుడు వేడిని పుట్టించి ఇబ్బందుల పాలు చేస్తున్నాడని, తమకు వేడిని పుట్టిస్తున్నాడని…తమను ఎలాగైన కాపాడాలని వినాయకున్ని వేడుకోగా, వినాయకుడు తమ శరీరాన్ని పెంచేసి ఆ రక్షసున్ని మింగేశాడు. అందుకు వెంటనే వినాయకుడి నిండి వేడి పుట్టడం మొదలైంది. అందుకు చంద్రుడు వచ్చి మంటను తగ్గిస్తానంటూ వినాయకుని తలపై నిలబడ్డాడు. అయినా కూడా తగ్గలేదు. విష్ణుమూర్తి తన కమలాన్ని ఇచ్చాడు.

మరమశివుడు పామును గణేషుని పొట్టచుట్టూ కట్టాడు. అయినా వేడి తగ్గలేదు. చివరకు కొంత మంది ఋషులు వచ్చి 21 గరిక పోచలతో వేడి తగ్గుతుందని చెప్పడంతో ఆ గరికను గణేషుని తలపై ఉంచారు. అంతే వెంటనే వినాయకుకి వేడి తగ్గిపోయిందట. అప్పుడు వినాయకుడు అన్నాడు…ఎవరైతే తనకు గరికతో పూజిస్తారో వారికి ఎల్లప్పుడు తన ఆశీర్వాదాలుంటాయని, కష్టాల నుంచి గట్టెక్కిస్తానని చెప్పడంతో అప్పటి నుంచి వినాయకుడికి గరికతో పూజిస్తారు.

Next Story