బోర్డ్ అనుమతి లేకుండానే రూ.18 కోట్లు స్వాహ చేసిన రవిప్రకాష్ గ్యాంగ్..!- సింగరావు
By Newsmeter.Network Published on 6 Oct 2019 12:34 PM IST
- రూ.18కోట్ల పైగా నిధులు డ్రా
- బోర్డు అనుమతి లేకుండానే .. బోనస్, ఎక్స్‌గ్రేషియా పేరుతో డ్రా
- రవిప్రకాష్ గ్యాంగ్‌పై కేసు
- 14 రోజుల పాటు రిమాండ్
- చంచల్‌గుడా జైల్‌కు తరలింపు
హైదరాబాద్ : రూ.18 కోట్లు చీటింగ్ చేసిన కేసులో ఆ టీవీ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 2017–18, 2018–19 ల్లో కం పెనీ లాభాలకు సమానంగా బోనస్, ఎక్స్ గ్రేషియాల కింద రూ.18,31,75,000 నగదు డ్రా చేసినట్లు అలందా యాజమాన్యం గుర్తించింది. అయితే టీడీఎస్ మినహాయింపుల తర్వాత రూ.11,74,51,808గా బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో కనిపిస్తోందని అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ హోల్‌టైమ్ డైరెక్టర్ జి.సింగారావు బంజారాహిల్స్ పోలీసులకు శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు.
టీవీ9 లోని 90.54 శాతం మెజారిటీ షేర్‌హోల్డింగ్‌ను అలందా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. కొత్త బోర్డు డైరెక్టర్లు సంస్థ రికార్డులు, బ్యాంకు ఖాతాల ఇంటర్నేషనల్ సంస్థలతో ఆడిటింగ్ చేయించారు. వీరి ఆడిటింగ్‌లో రవి ప్రకాష్, ఎంవీకేఎస్ మూర్తిలు మోసపూరితంగా డబ్బులు డ్రా చేశారని ఆడిటర్స్ గుర్తించారు. కంపెనీ డైరక్టర్ పెరీరా కూడా అక్రమంగా డబ్బులు వాడుకున్నారని తెలుసుకున్నారు. వీరి ముగ్గురు కలిసి రూ.18,31,75,000 డ్రా చేశారని రికార్డులను బట్టి తెలుస్తోంది.
వీరి చర్యలతో కంపెనీకి నష్టం కలిగిందని కొత్త యాజమాన్యం గుర్తించింది. అంతేకాదు..బోనస్, ఎక్స్ గ్రేషియా రంగు పులిమే ప్రయత్నం చేశారు. అసలు బోర్డు తీర్మానం లేకుండా ఇటువంటివి జరగకూడదు. కొత్త యాజమాన్యం సెప్టెంబర్ 24న డైరక్టర్స్ మీటింగ్ నిర్వహించింది. రవి ప్రకాష్ గ్యాంగ్ మోసాలపై పూర్తి స్థాయి చర్చలు జరిగిన తరువాతనే పీఎస్‌లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు జి. సింగారావు ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులతో రవి ప్రకాష్ వాగ్వాదం
రవి ప్రకాష్ తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీస్ జీప్‌లో రాను, తన కారులోనే పీఎస్‌కు వస్తానని రవి ప్రకాష్ పోలీసులతో అన్నారు. రవి ప్రకాష్ వాహనానికి ఎస్కార్ట్ ఇచ్చి రవి ప్రకాష్‌ను పీఎస్‌కు తరలించారు. పీఎస్‌కు వెళ్లగానే రవి ప్రకాష్ కారును పోలీసులు సీజ్ చేశారు. ఈ కారు కూడా టీవీ9కు సంబంధించినదేనని గతంలో అలందా మీడియా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. జడ్జి 14 రోజులు రవి ప్రకాష్ కు రిమాండ్ విధించారు. అనంతరం రవి ప్రకాష్ ను చంచల్ గుడా జైలు తరలించారు. రవి ప్రకాష్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. 9న విచారణకు రానుంది. రవి ప్రకాష్ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ పెట్టినట్లు డీసీపీ సుమతి చెప్పారు. రవిప్రకాష్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తామన్నారు.
�