వరదలో కొట్టుకుపోతున్న మహిళను కాపాడిన యువకుడు

By Newsmeter.Network  Published on  7 Oct 2019 8:18 AM GMT
వరదలో కొట్టుకుపోతున్న మహిళను కాపాడిన యువకుడు

హైదరాబాద్ : హైదరాబాద్ ను వానదేవుడు వదలడం లేదు. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. వీధులు నదులు అవుతున్నాయి. వర్షం పడే సమయంలో పని ఉండి బయటకు వస్తే అంతే సంగతులు అన్నట్లుంది పరిస్థితి. ఎక్కడ డ్రైనేజ్ ఉందో కనిపెట్టలేం. ఎక్కడా నాలా ఉందో చూడలేం. ఎక్కడా మ్యాన్ హోల్ ఉందో కనిపించదు. బయటకు వస్తే ఇంటికి పోయే దాకా గ్యారంటీలేని పరిస్థితి.

కింది వీడియోలో ఉన్న దృశ్యం ఎల్.బి.నగర్ లోని కాకతీయ కాలనీకి సంబంధించింది. వరదలో కొట్టుకుపోతున్న ఓ మహిళను యువకుడు కాపాడుతున్న దృశ్యాలు సీసీ కెమెరా క్యాచ్ చేసింది. మీరు చూస్తున్నది...జీహెచ్ఎంసీ పరిధిలోని ఓ వీధి. అది వీధిలా కాదు. నదిలా కనిపిస్తుంది. కారణం..డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేకపోడంతో వాన నీటికి ఎటూపోవాలో తెలియక రోడ్ల మీద పడుతుంది. దీంతో నడుస్తూ వెళ్లే వాళ్లకు ఈ మహిళ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వీడియో చూసిన తరువాతేనా ప్రభుత్వం, అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.

Next Story