ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అఘాయిత్యం

By Newsmeter.Network  Published on  13 Jan 2020 8:04 AM GMT
ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అఘాయిత్యం

శంషాబాద్‌ : స‌మాజంలో రోజు రోజుకు మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చినప్ప‌టికి కామాంధుల్లో మార్పు రావ‌డం లేదు. ఇటీవ‌ల బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినితో ఓ ఆటో డ్రైవ‌ర్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే తాజాగా ఓ ఎయిర్ లైన్స్ ఉద్యోగిని పై క్యాబ్ డ్రైవ‌ర్ అఘాయిత్యానికి య‌త్నించాడు. ఈ ఘ‌ట‌న ఆర్జీఐఏ ఠాణా పరిధిలో ఆదివారం జ‌రిగింది.

శంషాబాద్‌కు చెందిన యువతి(20) విమానాశ్రయంలోని ఓ ఎయిర్‌లైన్స్‌ సంస్థలో విధులు నిర్వర్తిస్తోంది. ఎప్పటిలా విమానాశ్రయానికి వెళ్లడానికి జాతీయ రహదారిపై అంబేడ్కర్‌ కూడలి వద్ద బస్సు కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో ఓ క్యాబ్‌ డ్రైవర్‌ ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లాక కారు పక్కకు ఆపి కోరిక తీర్చాలంటూ ఆమెను వేధించాడు. డోర్ లాక్ చేసి అత్యాచారానికి యత్నించాడు. ఆమె నుంచి సెల్‌ఫోన్ లాక్కుని దుస్తులు చించేశాడు. అదే సమయంలో అటు వైపు కొంతమంది రావడంతో క్యాబ్‌ డ్రైవర్‌ పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story