హుజూర్‌ నగర్ ఉప ఎన్నిక : హైకోర్ట్‌లో పిటిషన్ వేసిన తీన్మార్‌ మల్లన్న

By Newsmeter.Network  Published on  9 Oct 2019 11:05 AM GMT
హుజూర్‌ నగర్ ఉప ఎన్నిక : హైకోర్ట్‌లో పిటిషన్ వేసిన తీన్మార్‌ మల్లన్న

హైదరాబాద్‌ : హుజూర్ నగర్ ఉప ఎన్నిక పై తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ హైకోర్టు హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. తన ఎన్నికల ప్రచారానికి స్థానిక పోలీసులు అడ్డు వస్తున్నారంటూ పిటిషన్ వేశారు. మూడు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. తన ఎన్నికల ప్రచారానికి ఎటువంటి ఆటంకం కలగనీయకుండా పోలీసులకు ఆదేశాలివ్వాలన్నారు. ప్రతివాదులుగా ఎలక్షన్ కమిషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ హోం, సూర్యాపేట జిల్లా ఎస్పీ, హుజర్ నగర్ SHO లను చేర్చారు. అయితే...ఎన్నికల ప్రచారానికి ఎలాంటి ఆటకం కలగకుండా చూడాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు చెప్పింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది.

సీపీఐ ఆగ్రహం

మరోవైపు...అధికార టీఆర్ఎస్ పై సీపీఐ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై సీపీఐ నేతలు ఇంటర్నల్ గా నిప్పులు చెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మద్దతుపై పునరాలోచనలో ఉన్నట్లు సమాచారం. మద్దతుపై గురువారం పార్టీ కార్యవర్గంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

Next Story
Share it