వేశ్య పాత్రలో కుమ్మేస్తోన్న శ్రద్ధాదాస్

By రాణి  Published on  23 Jan 2020 1:52 PM GMT
వేశ్య పాత్రలో కుమ్మేస్తోన్న శ్రద్ధాదాస్

సౌత్ హాట్ బ్యూటీ 'శ్రద్దా దాస్' గురించి హాట్ హాట్ పదాలతో ఎంత చెప్పుకున్నా తక్కువే. అమ్మడుకి నటన రాకపోయినా... అందాలు పదర్శించడంలో ఆరితేరిపోయింది. ముఖ్యంగా ఫొటో షూట్స్ తో అందాల డోస్ మాములుగా ఇవ్వదు. బికిని వేసినా హాఫ్ శారీ కట్టినా ఈ హాట్ బ్యూటీ కుర్రకారును ఫుల్ గా రెచ్చగొడుతుంది. అసలు ఈ బ్యూటీ సొగసులకు మార్క్స్ వేయడం చాల కష్టం. అంతగా అందాలతో కనువిందు చేస్తోంది. కానీ ఎంత అందం ఆరబోసినా ఉపయోగం ఏముంది ? 'ఆర్య 2, డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడవేగ' లాంటి హిట్ చిత్రాల్లో మెరిసినా స్టార్ డమ్ సంపాదించలేకపోయింది ఈ అమ్మడు. ఇప్పటికీ తెలుగులో ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. అందుకే రెచ్చగొట్టే పాత్రల్లో నటించి అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.

ప్రముఖ కొరియోగ్రాఫర్ విద్యాసాగర్ దర్శకుడిగా మారి ఒక చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. జగపతిబాబు ప్రధాన పాత్రగా వస్తోన్న ఈ సినిమాలో శ్రద్దా దాస్ ఒక వేశ్య పాత్రలో నటిస్తోంది. కథ ప్రకారం ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే 'శ్రద్దా దాస్' పాత్ర బాగా బోల్డ్ గా ఉంటుందని.. ముద్దు సీన్స్ తో పాటు బెడ్ సీన్స్ కూడా సినిమాలో బాగా ఉంటాయని తెలుస్తోంది. అయితే అలాంటి సీన్స్ లో కూడా ఎలాంటి మొహమాటం లేకుండా 'శ్రద్దా దాస్' వేశ్య పాత్రలో నటనతో కుమ్మేస్తోందట. ఎందుకు కుమ్మదు, చాన్నాళ్ల తర్వాత శ్రద్దా దాస్ పూర్తి స్థాయిలో నటిస్తోన్న సినిమా ఇదేనాయే. మరి ఈ సారైనా ఈ బ్యూటీకి హిట్ వచ్చి స్టార్ డమ్ తో పాటు అవకాశాలు వస్తాయేమో చూడాలి. రాకపోయినా.. హాట్ ఫోటో షూట్స్ తోనే మ్యానేజ్ చేస్తోందనుకోండి, అది వేరే విషయం.

Next Story
Share it