తెలంగాణలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు వసూళ్లపై ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని, తిరుపతిరావు ఇచ్చిన కమిటీ నివేదికను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. వీలైనంత త్వరగా అధిక ఫీజులు వసూలు చేసే స్కూళ్ల జాబితాను ఇవ్వాలని హై కోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 8వ తేదీలోపు స్కూళ్ల జాబితా, పూర్తి వివరాలను హై కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వానికి తెలిపింది.

ఈ కేసు విచారణ వచ్చేనెల 9వ తేదీకి వాయిదా పడింది. కాగా..ప్రస్తుతం అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దందాపై ధర్నాలు, నిరసనలు చేశారు. కానీ..ఆయా పాఠశాలల తీరులో మాత్రం ఏ మార్పు రాలేదు. పుస్తకాలు, యూనిఫారమ్ లు, షూస్, ఇంకా రతరత్రా తరగతులు, స్పెషల్ కోచింగ్ ల పేరుతో అయినకాడికి దోచుకుంటున్నాయి. అదేమంటే..ఈతరం పిల్లలకు ఇవన్నీ స్కూల్ లోనే నేర్పించాలని కల్లబొల్లి కబుర్లు చెప్తున్నాయి. ఇలా అధిక ఫీజుల వల్ల మధ్యతరగతి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలన్నా అలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లీష్ మీడియం ను కూడా పెట్టడంపై మధ్యతరగతి కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

రాణి యార్లగడ్డ

Next Story