తమన్నా చూపు ఆ వెబ్ సిరీస్ మీదే.!

By Newsmeter.Network  Published on  31 Dec 2019 3:40 AM GMT
తమన్నా చూపు ఆ వెబ్ సిరీస్ మీదే.!

సినిమా అంటే ఒకప్పుడు అదొక అత్యద్భుతమైన ఆర్భాటం.. అదొక విలాసవంతమైన అట్టహాసం.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమా చూడాలంటే థియేటర్స్ లోనే చూడాలి అనే రోజులు పోయాయి. మన స్మార్ట్‌ఫోన్ల వాడకం ఎంత వేగంగా పెరిగిందో.. నేటి యువతరం అభిరుచి కూడా అంతకన్నా వేగంగా మారుతుంది. ఇప్పుడు అందరూ డిజిటల్ స్ట్రీమింగ్‌ వైపే వెళ్తున్నారు. దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీస్ కూడా డిజిటిల్ వైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే బడా నిర్మాతలు సైతం వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్లు కూడా డిజిటిల్ వైపు చూస్తున్నారు. ఒకవైపు వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంటూనే.. మరోవైపు వెబ్ సిరీస్ కథలను కూడా వింటూ, నచ్చితే నటించేస్తున్నారు.

కాగా ఇప్పటికే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వెబ్ సిరీస్ చేస్తుండగా.. ఆ మధ్యే సమంత కూడా 'థ ఫ్యామిలీ మాన్' అనే వెబ్ సిరీస్ రెండవ సీజన్ లో నటించింది. ఇప్పుడు వీరి బాటలోనే పాయల్ రాజ్ ఫుత్, మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అడుగులు వేస్తున్నారట. పాయల్ రాజ్ పుత్ ఓ హిందీ వెబ్ సిరీస్ లో నటించడానికి ఒప్పుకుంది. తమన్నా, శ్రుతి హాసన్ లు కూడా తమిళంలోని ఓ వెబ్ సిరీస్ కథ పట్ల బాగా ఇంట్రస్టింగ్ గా ఉన్నారట. ఇది తండ్రి, కూతుళ్ల మధ్య జరిగే సిరీస్ అట. ఎక్కువ నిడివి ఉన్న ఇలాంటి వెబ్ సిరీస్ స్టోరీస్ లో నటిస్తే తమ ప్రతిభను కనబర్చడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందనే ఉద్దేశ్యంతో తమన్నా ఈ వెబ్ సిరీస్ లో నటించాలనుకుంటుందట. అన్నట్టు ఈ వెబ్‌ సిరీస్‌ ను దర్శకుడు రామ సుబ్రమణ్యన్ డైరెక్ట్ చేయనుండగా, అనంద్ వికటన్ సంస్థ నిర్మిస్తోంది.

మొత్తానికి స్టార్ హీరోయిన్స్ అందరూ ఇలా డిజిటల్ ఫ్లార్ ఫామ్ వైపు చూస్తుండటంతో తెలుగు దర్శకనిర్మాతలు ప్రసుతం డిజిటల్‌ స్ట్రీమింగ్‌ సిరీస్ ల నిర్మాణం వైపు కసరత్తులు చేస్తున్నారు.

Next Story
Share it