థియేటర్లో టిక్కెట్లు అమ్మిన హీరోయిన్

By రాణి  Published on  18 Dec 2019 11:06 AM GMT
థియేటర్లో టిక్కెట్లు అమ్మిన హీరోయిన్

హైదరాబాద్ : ప్రతిరోజూ పండగే సినిమా హీరోయిన్ ఏంజెల్ అర్న అలియాస్ రాశీ ఖన్నా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం ఎర్రగడ్డ లోని గోకుల్ థియేటర్ లో అడ్వాన్స్ బుకింగ్ టికెట్లను అమ్మారు. ఇప్పటికే వెంకీమామ సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ అమ్మడు మరో సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా సేల్ టికెట్స్ గాళ్ అవతారమెత్తింది. హీరోయిన్ థియేటర్ కు వచ్చిందని తెలిసిన ఫ్యాన్స్, అటుగా వెళ్తున్న వారంతా ఆమెను చూసేందుకు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటెత్తారు.

కాగా మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా, రాఖీఖన్నా హీరోయిన్ గా నటించిన " ప్రతి రోజు పండగే " చిత్రం ఈ నెల 20వ తేదీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇటు గోదావరి జిల్లాలో, అటు విదేశాల్లో చిత్రించిన ఈ చిత్రంలో సత్య రాజ్, రావుగోపాలరావు తదితరులు నటించగా సంగీత దర్శకుడు తమన్ స్వరాలు సమకూర్చారు. జీవితంలో ప్రతి మూమెంట్ ను ఎంజాయ్ చేయాలన్న మెసేజ్ ఇస్తూ ఈ చిత్రం రూపొందించినట్లు సాయి ధరమ్ ఆల్రెడీ చెప్పేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ చిత్రంపై భారీ అంచనాలను పెంచేసింది.

Next Story