బిగ్ బాస్ హౌజ్‌లోకి హేమ...!!

By సత్య ప్రియ బి.ఎన్  Published on  1 Nov 2019 12:12 PM GMT
బిగ్ బాస్ హౌజ్‌లోకి హేమ...!!

బిగ్ బాస్ లో ఐదుగురు మాత్రమే మిగిలారు. అయితే, ఈ సంఖ్య మరనున్నట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌ షో ముగియడానికి రెండు రోజులు మాత్రమే మిగలడంతో ఫైనల్‌ కంటెస్టెంట్లకు బిగ్‌బాస్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నాడు. అందులో భాగంగా పద్నాలుగు వారాల్లో ఎలిమినేట్‌ అవుతూ వచ్చిన ప్రతి కంటెస్టెంట్‌ను తిరిగి హౌస్‌లోకి తీసుకురానున్నారు. ఈ మేరకు తాజా ప్రోమో విడుదలైంది. వీరందరూ వచ్చి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్నారు.

Big

7c6cd204 Db8a 449f 976b 7a647ae2c259

ఇందులో హేమ, జాఫర్‌, అషూ రెడ్డి, రోహిణి, వితిక, పునర్నవి, రవి, మహేశ్‌, శివజ్యోతి, హిమజ, తమన్నా, శిల్పా చక్రవర్తి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టు కనిపిస్తోంది.

A7e6120d 829e 4915 866d C7c5a9eb2335

ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన హేమ మళ్లీ బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగుపెట్టడం విశేషం. శ్రీముఖి అతివినయం చూపిస్తూ హేమ కాళ్లు

పట్టుకోబోయింది. వెంటనే హేమ ‘వద్దమ్మా’ అంటూ ఆమెకో నమస్కారం పెట్టిందని తెలుస్తోంది.

వీరి మధ్య ఉన్న పొరపొచ్చాలు తొలగుతాయా? బిగ్ బాస్ హౌస్ లో అందరి మధ్యా సఖ్యత ఉంటుందా? గొడవలు జరిగే అవకాశం ఉందా? అందరూ కలిసి చేసే రచ్చ చూడాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే!!!Next Story
Share it