బాదం.. జీడీ పప్పు.. రెండింటిలో ఏది మంచిది..!

By సుభాష్  Published on  9 Feb 2020 1:07 PM GMT
బాదం.. జీడీ పప్పు.. రెండింటిలో ఏది మంచిది..!

జీడీ పప్పు, బాదం, పిస్తా ఇలా అన్ని కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిని ఏదో ఒక రకంగా ఆహారంలో చేర్చుకుంటే ఎంతో మేలని వైద్యులు చెబుతున్నమాట. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి. చాలా మందికి బాదం, జీడీ పప్పు ఇందులో ఏది మంచిదనే సందేహం తలెత్తుతుంటుంది. రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే. ట్రైగ్లిసరైడ్స్‌ లను తగ్గించేందుకు ఉపయోగపడతాయి.

అంతేకాకుండా రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అలాగే వాటి వల్ల వచ్చే వాపులను సైతం తగ్గిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వీటి వల్ల గుండెకు సబంధించిన వ్యాధులు రాకుండా కాపాడుతాయని, బాదం, జీడీ పప్పు.. రెండింటిలోనూ ఒకే రకమైన కెలరీలు ఉన్నప్పటికీ.. జీడీ పప్పులో సాచ్యురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు, కార్పో హైడ్రేట్లు అధికంగా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. బాదంలో ప్రోటీన్లతో పాటు పీచు పదార్థాలు కూడా ఎక్కువే. అలాగే బాదంలో కాల్షియం ఎక్కువ ఉంటే జీడీ పప్పులు ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండింటిలోనూ పోషక పదార్థాలు ఉంటాయి. కాబ్టటి ఒకటికంటే ఒకటి మంచిదని కాకుండా రెండు కూడా సమానంగా తీసుకుంటే శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయని పేర్కొంటున్నారు.

జీడీ పప్పులో విటమిన్‌ బి6, సి, క్యాల్షియం, ఐరన్‌, మెగ్నిషియం, పోటాషియం, జింకు వంటి ఖనిజలవణాలు అధిక మోతాదులో ఉన్నందున గుండెకు ఎంతో ఉపయోగపడుతుంది. మన శరీరానికి సుమారు 300 నుంచి 750 మెగ్నిషియం అవసరం ఉన్నందు జీడీ పప్పును రోజు వారిగా తీసుకుంటే ఎంతో మంచిదంటున్నారు వైద్యులు.

అలాగే బాదం పప్పు రోజు నాలుగు చొప్పున తీసుకుంటే శరీరంలో చెడు కొవ్వు కరిగిపోయి స్లిమ్‌గా తయారయ్యేందుకు దోహదపడతాయంటున్నారు. అలాగే మన జుట్టుకు కావాల్సిన అన్ని రకాల విటమిన్లు, పోషకాలు బాదంలో ఉండటం వల్ల జుట్టు ఒత్తుగా, బలంగా ఉండటం, జుట్టు రాలిపోకుండా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

మధుమోహం ఉన్నవారికి..

మధుమోహం ఉన్నవారికి జీడీ పప్పు కంటే బాదం వల్లే అధిక ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. ఇక రెండింటిలోనూ అధిక కెలరీలు ఉన్నందున రోజుకు అన్ని కలిపి తీసుకుంటే ఎంతో మంచిదని చెబుతున్నారు.

Next Story