అరుదైన మైలురాయిని చేరుకున్న హెచ్ డీ ఎఫ్ సీ

By రాణి  Published on  19 Dec 2019 10:49 AM GMT
అరుదైన మైలురాయిని చేరుకున్న హెచ్ డీ ఎఫ్ సీ

ముంబై : ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ అరుదైన మైలురాయిని చేరుకుంది. తాజాగా ఈ బ్యాంక్ 100 బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది. అయితే ఇండియాలో ఈ మైలురాయిని చేరిన కంపెనీల్లో హెచ్ డీ ఎఫ్ ఎఫ్ సి మూడోవది కావడం విశేషం. రిలయన్స్ ఇండస్ర్టీస్ (140 బిలియన్ డాలర్లు), టాటా కన్సల్టెన్సీ (114.60 బిలియన్ డాలర్లు) ఈ క్లబ్ లో ఉన్నాయి. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో ఈ బ్యాంక్ అంత్యంత విలువైన కంపెనీల్లో 110వదిగా నిలిచింది. ఈ లిస్ట్ లో 109 కంపెనీలు 100 బిలియన్ డాలర్ల మార్క్ ను దాటాయి. 100 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను దాటిన బ్యాంకుల్లో హెచ్ డీ ఎఫ్ సీ 26వ ర్యాంకులో ఉంది. ఈ బ్యాంక్ వరుసగా లాభాలను ప్రకటించడంతో పెట్టుబడి దారులకు నమ్మకం పెరిగి, షేర్ల కొనుగోళ్లు శరవేగంగా జరుగుతున్నాయి.

Next Story