దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు కేవలం పురుషులే కారణమంటే అతను ఒప్పుకోడట. ఏ పురుషుడూ రాక్షసుడు కాదు..కావాలని యువతులే చేతులారా చావును కొనితెచ్చుకుంటున్నారని వ్యాఖ్యలు చేశాడొక కానిస్టేబుల్. ఇటీవల ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో అతను చేసిన వ్యాఖ్యలు బయటపడ్డాయి.

”ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కేవలం పురుషులే కారణమంటే నేను ఊరుకోను. యువతులకు కూడా తల్లిదండ్రులు పద్ధతులను నేర్పించాలి. కానీ…ఎప్పుడు తినాలి, ఎప్పుడు చదవాలి, ఎప్పుడు నిద్రపోవాలి అనేది కూడా ఆడపిల్లలకు నేర్పించే పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేరు. ఒళ్లు కనిపించే వస్త్రధారణ, ఛాతీలపై టాటూలతో మద్యం మత్తులో రాత్రిళ్లు రోడ్లపై తిరిగితే.. జరగరానిది జరిగితే పోలీసులు మాత్రం ఏం చేయగలరు? చలి ఉందని మేమైనా ఒంటినిండా వస్త్రాలను ధరిస్తాం.. కానీ కొందరు అమ్మాయిలు కురచ దుస్తులతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇలాంటి వాళ్లను కన్నవాళ్లే చంపేయాలి లేదంటే వేరెవరైనా చంపేస్తారు..” అని వ్యాఖ్యానించాడు గురుగ్రామ్ కు చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్.

ఇప్పుడు అతను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఆడపిల్లలు కురచదుస్తులు వేసుకుంటే వారిపై దారుణాలు చేసే ఆలోచన మగవాళ్లకు ఎందుకొస్తుంది ? యువతుల సంగతంటే సరే…మరీ ముక్కుపచ్చలారని చిన్నారులపై కూడా నిత్యం లైంగిక దాడులు జరుగుతున్నాయి. ఆ చిన్నారులు ఏం పాపం చేశారు ? వాళ్లలో కూడా పురుషులకు ఆడది కనిపిస్తుందా ? అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఆ కానిస్టేబుల్ స్ర్తీ ల వస్త్ర ధారణపై అలా కామెంట్ చేయడం సరికాదని ఖండిస్తున్నారు.

Also read:

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.