గన్ పార్క్ దగ్గర అశ్వత్థామ రెడ్డి సహా ఆర్టీసీ జేఏసీ నేతలు అరెస్ట్

By Newsmeter.Network
Published on : 7 Oct 2019 11:53 AM IST

గన్ పార్క్ దగ్గర అశ్వత్థామ రెడ్డి సహా ఆర్టీసీ జేఏసీ నేతలు అరెస్ట్

హైదరాబాద్‌ : గన్ పార్క్‌ దగ్గర నిరసన తెలియజేయడానికి వచ్చిన 30 మంది ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి పలు పీఎస్‌లకు తరలించారు. ఆర్టీసీ జాక్ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డిని అబిడ్స్ పీఎస్‌కు పోలీసులు తరలించారు.

మూడో రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన సమ్మెతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పండుగ సమయం కావడంతో సొంత ఊళ్లకు వెళ్లలేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కొన్ని చోట్ల అధిక ఛార్జీలు వసూలు చేస్తుండటంతో గొడలు కూడా అవుతున్నాయి.

అయితే..నిన్న సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఆర్టీసీ అధికారులు, కొంత మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులను హెచ్చరించారు. 48వేల మంది ఉద్యోగాలు పోయినట్లేనని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర ఆర్టీసీ జేఏసీ నేతలు దీక్షకు దిగారు. ఈ దీక్షకు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది.

Next Story