విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన కళాశాల

By రాణి  Published on  15 Feb 2020 7:05 AM GMT
విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన కళాశాల

మహిళలు అన్ని రంగాల్లో పై చేయి సాధిస్తున్న నేటి కాలంలో ఇంకా చాలా మంది పాత ఆచారాలు, సాంప్రదాయాలంటూ మూఢ నమ్మకాలను నేటితరంపై రుద్దుతూ..అమానుషంగా..మానవత్వం లేకుండా ప్రవర్తించి సమస్యలను కొని తెచ్చుకుంటుంటారు. తాజాగా గుజరాత్ లోని భుజ్ ప్రాంతంలో ఉన్న శ్రీ సజానంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్ పరిస్థితి ఇది. రుతుస్రావంలో ఉన్న అమ్మాయి ఆ కాలేజీ హాస్టల్ లో ఉండే వంటగది, దేవుడి గదిలోకి రాకూడదనేది అక్కడి నియమం. కాగా..గత బుధవారం కొందరు అమ్మాయిలు పీరియడ్స్ లో ఉన్నప్పటికీ వంటగదిలోకి వచ్చారని కాలేజీ ప్రిన్సిపల్ కు కంప్లైంట్ అందడంతో..సదరు ప్రిన్సిపల్ ఈ ఘటనపై చర్యలు తీసుకున్నారు. కళాశాల సిబ్బంది 68 మంది విద్యార్థినులను రెస్ట్ రూం కు తీసుకెళ్లి వారితో బలవంతంగా పై దుస్తులు, లో దుస్తులు తీయించి పీరియడ్స్ లో ఉన్నారా లేదా అని చూశారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది.

కళాశాలలో విద్యార్థినుల పట్ల జరిగిన అమానవీయ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయి కేసును సుమోటాగా తీసుకుంది. దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. బాధిత విద్యార్థులను సంబంధిత కమిటీ సభ్యులు కలిసి జరిగిన ఘటనపై ఆరా తీయనున్నట్లు ఎన్ సీ డబ్ల్యూ పేర్కొంది.

Next Story