పెళ్లైన కొద్దిసేపటికే..విషాదం

By రాణి  Published on  15 Feb 2020 5:59 AM GMT
పెళ్లైన కొద్దిసేపటికే..విషాదం

ఆ జంటకు పెళ్లి జరిగిన కొద్దిసేపటికే ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం మంగళి గణేష్‌ (25)కు వివాహమయింది. పెళ్లి వేడుకలో భాగంగా రాత్రి బారాత్ నిర్వహించారు. బారాత్ లో పెళ్లి కూతురితో కలిసి చిందేస్తూనే గణేష్ కుప్పకూలిపోయాడు. బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా..అప్పటికే అతను గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. డీజే సౌండ్ వల్లే గణేష్ కు గుండెపోటు వచ్చిందని భావిస్తున్నారు. పెళ్లి జరిగిన రోజే పెళ్లికొడుకు మృతి చెందడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

ఈ మధ్య జరిగే పెళ్లిళ్లలో పెళ్లి మంత్రాలకన్నా డీజే సౌండ్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. సాంప్రదాయబద్ధంగా జరగాల్సిన పెళ్లిళ్లలో కూడా ఐటమ్ సాంగ్స్ పెట్టి..పెళ్లికొచ్చిన కుర్రకారంతా తప్పతాగి చిందులేస్తున్నారు. అంతేకాకుండా చాలా మంది తమ తాహతకు మించి పెళ్లిళ్లు చేస్తున్నారు. నిజానికి తీసుకునే కట్నాల కన్నా పెళ్లిళ్ల కోసం చేసే ఖర్చులే ఎక్కువవుతున్నాయంటే నమ్మశక్యం కాదు. అదీ కాక చాలా వరకు యువత పెళ్లి అంటేనే నో చెప్పేస్తోంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కాస్త ఉద్యోగాలు చేసుకుంటున్నాం..అప్పుడే పెళ్లేంటి ? అని ప్రశ్నిస్తోంది. 70 శాతం పెళ్లిళ్లు జరిగే వారి వయసు 30 సంవత్సరాలకు తక్కువైతే ఉండట్లేదు.

Next Story