హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన హిస్టారిక్‌ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. ఉయ్యాలవాడ నరసింహరెడ్డి పోరాటం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. బాక్సాపీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడుతుంది. తెలంగాణ గవర్నర్ తమిళసై ఈ చిత్రాన్ని కుటుంబ సభ్యులతో వీక్షించారు. గవర్నర్‌తోపాటు హీరో చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా సినిమా చూశారు. గవర్నర్ తమిళి సై కోసం చిరు ప్రత్యేక షో ఏర్పాటు చేశారు. శనివారం..గవర్నర్‌ను కలిసి సైరా చిత్రాన్ని చూడాల్సిందిగా ఆహ్వానించారు చిరు. ఆయన ఆహ్వానాన్ని మన్నించి గవర్నర్ తమిళి సై కుటుంబ సభ్యులతో కలిసి మూవీ చూశారు.

Img 20191009 Wa0058

Img 20191009 Wa0059

అక్టోబర్2న విడుదలైన సైరా విడుదలైన అన్ని చోట్ల విజయపథంలో దూసుకెళ్తుంది. దీనిలో అమితాబ్, కిచ్చా సుదీప్,  విజయసేతు, తమన్నా, నయనతార  ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా ప్రారంభం  నుంచి ఎండింగ్ వరకు చిరు నరసింహరెడ్డి పాత్రకు ప్రాణం పోశారని అభిమానులు అంటున్నారు. నరసింహరెడ్డి పాత్రలో ఆయన చూపిన బాడీ లాంగ్వేజ్, పలికిన డైలాగ్ లు ఆయన నటశిఖరుడ్ని చేశాయని చెబుతున్నారు. ఈ సినిమాతో చిరుకు జాతీయ అవార్డ్ ఖాయమని టాలీవుడ్ టాక్.

Img 20191009 Wa0061

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.