కేబుల్ టీవీ వినియోగదారులకు గుడ్ న్యూస్
By సుభాష్ Published on 13 Jan 2020 10:03 AM GMT
కేబుల్ టీవీ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది ట్రాయ్. ప్రస్తుతం చెల్లించే కేబుల్ టీవీ బిల్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కేబుల్ టీవీ బిల్లులో 14 శాతం వరకు అదా అయ్యే అవకాశం ఉంది. కాగా, టారిఫ్ ఆర్డర్‌కు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజాగా సవరణలు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ట్రాయ్ చేసిన ఈ సవరణల ప్రకారం.. రూ.130కే ఫ్రీ టూ ఎయిర్ చానెల్స్ ఇవ్వాలని ట్రాయ్ తెలిపింది. ట్రాయ్ చేసిన సవరణల ప్రకారం ఇక రూ. 130కే దాదాపు 200 వరకు ఛానెళ్లు వీక్షించే అవకాశం కల్పించింది. గతంలో వంద ఛానల్స్ మాత్రమే చూసే వీలు ఉండేది. మెజార్టీ ప్రజలు వీక్షించే స్పోర్ట్స్ ఛానల్ ధరలు కూడా ఒక్కో ఛానల్‌కు రూ. 12 చెల్లిస్తే సరిపోతుంది. బొకే ఛానల్ ఖరీదు రూ. 12మించకూడదని ట్రాయ్ తేల్చి చెప్పింది.
కాగా, ఈ ధర ఇన్నాళ్లు రూ. 19గా ఉండేది. ప్లేస్‌మెంట్ మార్చాలంటే అనుమతులు తప్పని సరి ఉండాల్సిందేనని ట్రాయ్ చైర్మన్ ఆర్ ఎస్ శర్మ స్పష్టం చేశారు. ఒక ఇంట్లో ఒకటి క టే ఎక్కువ కనెక్షన్లు ఉంటే 40 శాతం వసూలు చేయాలని తాజాగా కేబుల్ ఆపరేటర్లకు ట్రాయ్ సూచించింది. ప్రస్తుతం కేబుల్ బిల్లుతో ఇబ్బందులకు గురవుతున్న వినియోగదారులకు ట్రాయ్ తాజా నిర్ణయంతో కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఏర్పడింది. గతంలో అన్ని ఛానళ్లు కలిసి రూ. 250 నుంచి 300 వరకు ఉండేది. తరువాత ట్రాయ్ నిర్ణయంతో వినియోదారులకు షాకిచ్చినట్లయింది. అప్పటి నుంచి సామాన్యులు కేబుల్ టీవీ కనెక్షన్ అంటేనే జడుసుకునేవారు. మరో వైపు ట్రాయ్ ఆదేశాలను కేబుల్ టీవీ ఆపరేటర్లను పాటించకపోవడంతో వినియోగదారులకు భారంగా మారింది. మళ్లీ ట్రాయ్ చేసిన సవరణలు ఎంత వరకు అమలవుతాయో చూడాల్సిందే.