గత నాలుగైదు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన పసిడి ధరకు కాస్త బ్రేకులు పడ్డాయి. దీంతో బంగారం కొనాలనే వారికి ఇది బ్యాడ్‌ న్యూసే అని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గినా మన దేశంలో పెరగడం గమనార్హం.

ఇక హైదరాబాద్‌లో శుక్రవారం 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.290 పెరిగింది. ప్రస్తుతం రూ. 39,440 నుంచి రూ. 39,730 వరకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 190 పెరుగుతూ రూ. 43,080 నుంచి రూ. 43,275 వరకు చేరుకుంది.

ఇక వెండి ధర కూడా అదే బాటలోనే.. కిలో వెండి ధర రూ. 220 పెరుగుతూ రూ. 40,160కి ఎగబాకింది. కాగా, పరిశ్రమలు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ అధికం కావడమే ఇందుకు కారణమని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర తగ్గాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.34 శాతం క్షిణించి 1629.65 డాలర్లు తగ్గింది. బంగారం ధర తగ్గితే, వెండి ధర కూడా అదే బాటలో నడుస్తోంది. వెండి ధర ఔన్స్‌కు 0.63 శాతం క్షిణించి 14.56 డాలర్లకు పడిపోయింది.

ఇక దేశ రాజధానిలో…

ఇక దేశ రాజధాని అయిన ఢిల్లీలో కూడా బంగారం ధర ఎగబాకింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.220 పెరుగుతూ రూ. 41,180కు చేరింది. ఇక 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.260 పెరగడంతో రూ.43,470కి చేరుకుంది. ఇక కిలో వెండిపై రూ.220 పెరుగుతూ ప్రస్తుతం రూ.40160కి చేరుకుంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.