కొండెక్కిన బంగారం ధర.. రూ.49వేలకు చేరుకున్న పసిడి

By సుభాష్  Published on  25 May 2020 4:45 AM GMT
కొండెక్కిన బంగారం ధర.. రూ.49వేలకు చేరుకున్న పసిడి

బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. బంగారం ధరలు రోజురోజుకు పరుగులు పెడుతున్నాయి. మార్కెట్లో వరుసగా రెండో రోజు ధరలు పెరిగాయి. రూ.49వేల మార్కును చేరుకున్నాయి. దేశీయ కొనుగోళ్లు, సెంట్రల్‌ బ్యాంకులో బంగారం నిర్వలు, నాణేపు తయారీ, తదితర కారణాలతో బంగారం ఎగబాకుతోంది.

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ బులియన్‌ మార్కెట్లో సోమవారం 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.49000 చేరుకకుంది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,350కి చేరుకుంది. ఇక ఢిల్లీలోనూ కూడా వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,910కి చేరుకుంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.,46,120కి చేరుకుంది. ఇక కిలో వెండి రూ. 48,380 ఉంది.

అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు, దేశీయంగా బంగారానికి డిమాండ్‌, అలాగే స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ధరల్లో కూడా ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనంచి బంగారాన్ని కొనుగోలు చేయాలని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు.

Next Story