మనం బాగుండాలంటే అమ్మ దయ ఉండాలి. అమ్మ దయ ఉంటేనే సంతోషంగా ఉండగలం. దుర్గమ్మపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా భక్తి చూపించుకుంటారు. తెలంగాణలో రూ.3,33,33,333లతో అమ్మవారిని అలంకరించారు. అంతేకాదు..మండపాన్ని కూడా డబ్బుతోనే చేశారు. ఎక్కడైనా డబ్బులతో మండపానికి అవసరమైనవి కడతారు. ఇక్కడ మాత్రం మండపం కూడా కరెన్సీతో చేశారు. అమ్మ మీద ఎంత భక్తి ఉంటే ఇలా చేస్తారు. లక్ష్మీదేవి తోడుండగా కనక దుర్గమ్మ అమ్మవారు కరెన్సీ కట్టల్లో వెలిగిపోతున్నారు.

మరోవైపు ఏపీలోని విశాఖపట్నంలో కూడా కన్యక పరమేశ్వరి అమ్మవారిని రూ.2 కోట్లతో అలంకరించారు. అంతేకాదు..4కేజీల బంగారంతో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించారు. కన్యకపరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ భక్తులు తన్మయత్వం పొందుతున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.