ప్రియుడి ఇంటి మీదకు గొడవకు వెళ్ళిన ప్రియురాలు..
By Newsmeter.Network Published on 26 Dec 2019 2:40 PM GMTప్రియుడు కనిపించట్లేదని అతడి ఇంటిమీదికి గొడవకు వెళ్లిన ఘటన బాచుపల్లిలో చోటుచేసుకుంది వివరాళ్లోకి వెళితే మాదాపూర్ లోని ఓ సంస్థలో సీనియర్ మేనేజర్ గా పని చేస్తున్న వ్యక్తితో మణికొండ చిత్రపురి కాలనీకి చెందిన యువతితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. అంతకుముందే ఆ వ్యక్తికి వివాహం జరిగింది. తను ప్రేమించిన వ్యక్తి కొన్ని రోజులుగా కనిపించకుండా పోయేసరికి బాచుపల్లిలో ఉండే ప్రియుడి ఇంటికి వెళ్ళింది. ఆ ఇంట్లో యువకుడి తల్లిదండ్రులు మాత్రమే ఉండడంతో తనకు పెళ్లి జరిపించాలంటూ వారితో గొడవకు దిగింది.
దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువతితో పాటు యువకుడి తల్లిదండ్రులను పోలీసు స్టేషన్ కు తరలించారు. అయితే యువతి పోలీసుస్టేషన్‌లో వీరంగం సృష్టించింది. పలు సార్లు బయటకు పరుగెత్తే ప్రయత్నం చేసింది. ప్రేమించిన వ్యక్తితో తనకు వివాహం చేయకపోతే చనిపోతానని బెదిరించింది. అయితే పోలీసులు కలుగ జేసుకొని ఆ యువకుడిని తీసుకొస్తాం అనడంతో ఆ యువతి శాంతించింది. అనంతరం ఆ యువతిని వారి అన్నకు అప్పగించారు. బాధితురాలిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.