‘కరోనా’వ్యాప్తిపై.. జర్మనీ వైస్‌ఛాన్స్‌లర్‌ సంచలన వ్యాఖ్యలు!

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఏ దేశానికి మినహాయింపు ఇవ్వకుండా అన్ని దేశాల్లో వేగంగా వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. దీంతో ఈ మహమ్మారి భారిన పడి ఇప్పటికే 4,600 మంది ప్రాణాలు కోల్పోగా లక్షలా20వేల మంది ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. ఈ మహమ్మారిని అరికట్టేందుకు అన్ని దేశాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. ప్రజలను అన్నివిధాల అప్రమత్తం చేస్తున్నారు. అయినా ఇది వ్యాప్తిచెందుతూనే ఉంది. కోవిడ్‌ 19ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మహమ్మారిగా ప్రకటించారు.

ఇదిలాఉంటే జర్మనీ దేశంలోనూ కోవిడ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 2వేలకుపైగా కరోనా వైరస్‌ భారిన పడగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.  ఈనేపథ్యంలో జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మార్కెల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ జనాభాలో మూడింట రెండింతలు జనాభా కోవిడ్‌ భారినపడే ముప్పు పొంచి ఉందని అన్నారు. దాదాపు 70శాతం మందికి ఈ వైరస్‌ సోకే ప్రమాదం ఉందని, మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎంత చేయాలో అంతా చేస్తామని ఆమె తెలిపారు. దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ ముప్పు తీవ్రంగానే ఉందని మార్కెల్‌ పేర్కొన్నారు. దీనికి వాక్సిన్‌, చికిత్సను కనుక్కోకపోతే దేశ జనాభాలో 60శాతం నుంచి 70శాతం వరకు ప్రజలు కోవిడ్‌ బాధితులుగా మారతారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే మార్కెల్‌ వ్యాఖ్యలపై చెక్‌ ప్రధానమంత్రి విమర్శలు గుప్పించారు. ఆమె వ్యాఖ్యలు ప్రజలను మరింత భయాందో్ళనకు గురిచేస్తాయని అన్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *