గుడ్‌న్యూస్‌: భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

By సుభాష్  Published on  1 May 2020 7:41 AM GMT
గుడ్‌న్యూస్‌: భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

గ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా తగ్గింది. ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.214 తగ్గింది. ఇక కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ (19కిలోలు) ధర రూ. 336 వరకు దగొచ్చింది. ఈ కొత్త ధరలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

తాజాగా ధరలు తగ్గింపుతో ఎల్పీజీ సిలిండర్‌ (14కిలోలు) రూ.583న నుంచి మొదలవుతుంది. ఇక కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 988 నుంచి ఆరంభమవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ధరలు భారీగా తగ్గిపోవడంతో గ్యాస్‌ సిలిండర్‌ ధర కూడా దిగివచ్చింది.

నగరాల వారిగా గ్యాస్‌ ధరలు .. ఢిల్లీలో రూ. 744 నుంచి 611కు దిగొచ్చింది. కోల్‌కతాలో రూ.839 నుంచి 774 వరకు క్షిణించింది. ఇక ముంబైలో రూ. 579 ఉంది. చెన్నైలో రూ.761 నుంచి 569కు తగ్గింది. ఇక హైదరాబాద్‌లో రూ.862 నుంచి 796కు తగ్గింది.

కాగా, కేంద్ర సర్కార్‌ మామూలుగా ప్రతీ కుటుంబానికి 12 గ్యాస్‌ సిలిండర్లను సబ్సిడీ ధరకే సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది 14 కిలోల గ్యాస్‌ సిలిండర్‌లకు మాత్రమే వర్తిస్తుంది. 12కంటే ఎక్కువ తీసుకున్నట్లయితే సబ్సిడీ రాకుండా పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుంది.

Next Story