మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
By సుభాష్ Published on 1 July 2020 5:03 AM GMTగ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మళ్లీ షాకిచ్చింది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. మళ్లీ స్వల్పంగా గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. మెట్రో నగరాల్లో సిలిండర్‌కు రూ. 4.50 వరకు పెంచారు. ఇక సబ్సిడీ లేని 14.2 కిలోల సిలిండర్‌పై ఢిల్లీలో ఒక రూపాయి, ముంబై రూ.3.50 పైసలు, కోల్‌కతాలో రూ.4.50పైసలు, చెన్నైలో రూ.4,హైదరాబాద్‌లో రూ.4.50 పైసల చొప్పున పెరిగాయి. అయితే ఎల్పీజీ సిలిండర్ ధర జూన్‌లో రూ. 11.5 మేర పెంచిన విషయం తెలిసిందే.
దీనికన్న ముందు మార్చి నుంచి మే నెల వరకూ గ్యాస్ సిలిండర్ ధర రూ.277 మేర తగ్గింది. కాగా, పెట్రోల్ ధరలు ప్రతి రోజూ మారుతున్నేట్లునేగా గ్యాస్ సిలింబర్ ధర ప్రతినెలా మారుతూ వస్తోంది. కాగా, కేంద్ర సర్కార్ ఏడాదికి 12 సిలింబర్లను ప్రజలకు సబ్సిడీ రూపంలో అందజేస్తోంది.
సబ్సిడీయేతర ఎల్‌పీజీ సిలిండర్ ధర (14.2 కిలోలు)
హైదరాబాద్ : రూ.645
ఢిల్లీ : రూ. 594
ముంబై : రూ.594
కోల్‌కతా : 620
చెన్నై : 610.50