రిషికేశ్ లో ఫ్రెంచ్ మహిళ నగ్నంగా ఫోటో షూట్.. అరెస్ట్..!

By సుభాష్  Published on  29 Aug 2020 9:39 AM GMT
రిషికేశ్ లో ఫ్రెంచ్ మహిళ నగ్నంగా ఫోటో షూట్.. అరెస్ట్..!

27 సంవత్సరాల ఫ్రెంచ్ మహిళను ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్ లో అరెస్టు చేశారు. ఇంతకూ ఆమె చేసిన తప్పు ఏమిటో తెలుసా..? నగ్నంగా ఫోటో షూట్ లో పాల్గొనడమే..! గంగానది పరివాహక ప్రాంతంలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన లక్ష్మణ్ ఝూలా ప్రాంతంలో ఆమె నగ్నంగా ఫోటో షూట్ లో పాల్గొంది. ఫోటోలు, వీడియోలను చిత్రీకరించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

స్థానిక వార్డు కౌన్సిలర్ గజేంద్ర సజ్వాన్ ఆగష్టు 25న ఫ్రెంచ్ మహిళ మీద ఫిర్యాదు చేయడంతో గురువారం నాడు అరెస్టు చేశారు.

'ముని కి రేటి' పోలీసు స్టేషన్ కు చెందిన సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్.కె.సైని ఈ ఘటనపై మాట్లాడుతూ 'గజేంద్ర సజ్వాన్ ఫిర్యాదును తాము తీసుకున్నామని.. ఫ్రెంచ్ మహిళ ఆ ప్రాంతంలో వీడియోలను ఫోటోలను తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినట్లు తెలిసిందని.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం ఆమె మీద కేసు రిజిస్టర్ చేశాము' అని అన్నారు. ఈ ఘటన లక్ష్మణ్ ఝూలా ప్రాంతంలో చోటు చేసుకుందని.. స్థానికులను ఈ ఘటనపై ఆమె రిషికేశ్ లోని హోటల్ లో ఉన్నట్లు తెలిపారు. పోలీసులు ఆమె ఉంటున్న హోటల్ కు చేరుకొని ఆ ఘటనపై ప్రశ్నించారు.

ఆమె తాను నగ్నంగా ఫోటో షూట్ చేసినట్లు ఒప్పుకుంది. భారతదేశంలో నగ్నంగా ఫోటో షూట్ చేయడం నిబంధనలకు వ్యతిరేకం అని తనకు తెలియదని పోలీసులతో చెప్పుకుంది. తన బెడ్-నెక్ లేస్ బిజినెస్ ను ప్రమోట్ చేసుకోడానికి ఈ ఫోటో షూట్ ను చేశానని ఆమె తెలిపింది. ఆమె చేసింది తప్పు కావడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమెను బెయిల్ పై విడుదల చేశారు.

ఆమె గత నాలుగైదు నెలలుగా రిషికేశ్ లోనే ఉందని పోలీసులు వెల్లడించారు. ఫ్రాన్స్ లో ఇలాంటివి చాలా కామన్ అని అనుకున్న ఆ మహిళ అదే తరహాలో రిషికేశ్ లో కూడా ఉంటుందని భావించిందని పోలీసులు తెలిపారు. తాను చేసిన తప్పు ఆమె తెలుసుకుందని కూడా పోలీసులు తెలిపారు.

Next Story