క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్యం

By రాణి  Published on  3 Jan 2020 8:19 AM GMT
క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్యం

  • ఆరోగ్యశ్రీ లో కొత్తగా 1000 వ్యాధులు

ఇకపై ఆస్పత్రిలో చేయించుకునే చికిత్సకు బిల్లు రూ.1000 దాటితే..ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పర్యటించిన అనంతరం ప్రసంగించారు. ఆరోగ్యశ్రీ దేశ ఆరోగ్య చరిత్రలోనే విప్లవం తీసుకొచ్చిందన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పట్టించుకోలేదని విమర్శించారు. ఇకపై ఆరోగ్యశ్రీ కింద 2059 వ్యాధులకు వైద్యసేవలు అందించనున్నట్లు జగన్ వెల్లడించారు. ఇప్పటి వరకూ 1059 వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తించేదని, ఇప్పుడు మరో వెయ్యి సెవలు పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి క్యాన్సర్ రోగులు వైద్యం చేయించుకునేందుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనక్కర్లేదని, వారి వైద్యానికయ్యే పూర్తి ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఆరోగ్యశ్రీకి కూడా ప్రత్యేక కార్డులిస్తున్నామని, నేటి నుంచి కోటి 42 లక్షల ఆరోగ్యశ్రీ కార్డులను ఇస్తున్నట్లు జగన్ ప్రకటించారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కో నెల ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేస్తామన్నారు. అలాగే ఇకపై ఇచ్చే ఆరోగ్యశ్రీ కార్డులకు క్యూ ఆర్ బార్ కోడ్ ఉంటుందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా సరఫరా చేసే మందుల నాణ్యతను కూడా పెంచనున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి రాష్ర్ట వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ పూర్తిగా అమలులోకి వస్తుందన్నారు.

Next Story