హైదరాబాద్ లో ఫ్రీ భోజనం..

By రాణి  Published on  26 March 2020 6:12 AM GMT
హైదరాబాద్ లో ఫ్రీ భోజనం..

  • 40 వేలమంది ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చిన జీహెచ్ఎంసీ
  • అక్షయపాత్రతో డీల్ చేసుకున్న జీహెచ్ఎంసీ

ఇప్పటి వరకూ అక్కడక్కడా జీహెచ్ఎంసీ అన్నపూర్ణ సెంటర్లలో రూ.5 కు మధ్యాహ్న భోజనాన్ని అందించారు. కానీ ఇప్పుడు కరోనా కారణంగా జీహెచ్ఎంసీ భోజన సెంటర్లతో పాటు రెస్టారెంట్లు, హోటళ్లన్నీ మూతపడ్డాయి. చాలా కంపెనీలు మూతపడ్డాయి. ఉద్యోగులు, విద్యార్థులు సొంతఊర్లకు వెళ్లలేక..బయట తినేందుకు భోజన సెంటర్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. హాస్టళ్లు మూసివేయడంతో వేలమంది విద్యార్థులు రోడ్డుపాలయ్యారు. ఇళ్లకు వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎంతోమంది యాచకులు, శరణార్థులు ఆహారం లేక విలవిల్లాడుతున్నారు. ఈ సమయంలో జీహెచ్ఎంసీ తన ఉదారతను చాటుకుంటోంది. రూ.5కు అందించే భోజనాన్ని ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చింది.

40వేలమంది (యాచకులు, హాస్టల్ విద్యార్థులు, బ్యాచిలర్స్, శరణార్థులు) ఆకలిని తీర్చేందుకు భోజనాలను సిద్ధం చేస్తోంది. కరోనా బారి నుంచి పూర్తిగా బయటపడేంత వరకూ లాక్ డౌన్ ఇలాగే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అప్పటి వరకూ జీహెచ్ఎంసీ ఆకలితో ఉండేవారందరికీ కడుపునిండా భోజనాన్ని అందించనుంది. ఇలా ఆహారాన్ని అందించేందుకు అక్షయపాత్ర సంస్థతో డీల్ కూడా కుదుర్చుకుంది. జీహెచ్ఎంసీ పేదలు, యాచకులు, విద్యార్థుల ఆకలిని తీర్చేందుకు అడుగు ముందుకేయడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. భాగ్యనగరంలోని అన్ని ప్రధాన జీహెచ్ఎంసీ భోజన సెంటర్లలో ఫ్రీ గా భోజనాన్ని అందించనుంది.

Next Story