సత్తు డబ్బాలో స్టైలిష్ భోజనం.. అదీ ఇంగ్లండ్ లో..

By సుభాష్  Published on  17 Feb 2020 3:10 PM GMT
సత్తు డబ్బాలో స్టైలిష్ భోజనం.. అదీ ఇంగ్లండ్ లో..

అల్యూమినియంతో చేసిన పాతకాలపు మూడు, నాలుగు లేదా అయిదు డబ్బాల టిఫిన్లు గుర్తున్నాయా? ఒక మర చెంచాతో దానిని మూసేవాళ్లం. ఎక్కడ పడితే అక్కడికి తీసుకువెళ్లే వాళ్ళం. కారిపోవడం వంటి సంమస్యలే ఉండేవి కావు. ఇప్పుడు లండన్ లో ఒకాయన ఒక ధాబా పెట్టి, డబ్బాల్లో అన్నం ప్యాక్ చేసి ఇస్తున్నాడు. ప్లాస్టిక్ డబ్బాలు, యూజ్ అండ్ త్రోలు వాడివాడి విసిగిపోయిన ఉన్న వారికి పార్సెల్ భోజనాలను ఈ డబ్బాల్లో పెట్టి ఇస్తున్నాడు. ఇప్పుడిది ఒక క్రేజ్ గా, ఒక ఫ్యాషన్ స్టేట్ మెంట్ గా మారిపోయింది. అందరూ ఇప్పుడు హ్యారీ ఖిండా అనే ఈ పంజాబీ మూలానికి చెందిన హోటలియర్ వద్దకే పరుగులు తీస్తూ వస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దనుకునే వారందరికీ ఈ హోటల్ చాలా ఉపయోగకరంగా ఉంది.

క్లింగ్ అనేది మామూలుగానే అలవాటు. అది వారి జీవితంలో అంతర్భాగం. వారి నిత్య జీవితంలో రీసైక్లింగ్ చేస్తూనే ఉంటారు. అదే సంప్రదాయాన్ని, పర్యవరణ ప్రేమను నేను నా డబ్బా ప్యాకింగ్ ద్వారా కొనసాగిస్తున్నాను అంటున్నాడు ఖిండా. ఈ రీయూజబుల్ అల్యూమినియం డబ్బాల వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం తగ్గుతుందని ఆయన అంటాడు. మా తాతలు ఇదే పద్ధతిలో భోజనాన్ని ప్యాక్ చేయించి వెంట తీసుకువెళ్లేవారు. ఇదే పద్ధతిని నేను కొనసాగిస్తున్నానంటున్నాడు ఖిండా. 1960 వ దశకంలో తన తండ్రి ఇంగ్లండ్ కి వచ్చినప్పుడు ఫ్యాక్టరీలు, ఫౌండ్రీల్లో పనిచేసేటప్పుడు ఇలాంటి బాక్సుల్లోనే లంచ్ ను తీసుకువెళ్లేవాడని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఆయన రెస్టరెంట్లలో ఇప్పుడీ పద్ధతి యమ క్రేజుగా మారింది. అందరూ ఈ తరహా ప్యాకింగ్ నే కోరుకుంటున్నారు. 2008 లో రెస్టారెంట్ ప్రారంభమైనప్పట్నుంచీ ఇదే ట్రెండ్ కొనసాగుతోందని 48 ఏళ్ల ఖిండా చెబుతున్నాడు. లండన్ లో, ఇంగ్లండ్ లో భారతీయ ఆహారానికి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదని ఆయన అంటున్నాడు. ఈపాపులారిటీని మరింత పెంచేందుకు మాత్రమే తాను ఈ డబ్బాల విధానాన్ని ప్రవేశపెట్టానని ఆయన చెబుతున్నారు.

Next Story