అజారుద్దీన్‌పై కేసు నమోదు

By సుభాష్  Published on  23 Jan 2020 5:51 AM GMT
అజారుద్దీన్‌పై కేసు నమోదు

భారత క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌తో కేసు నమోదైంది. అజారుద్దీన్‌తో పాటు మరో ఇద్దరిపై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ట్రావెల్‌ ఏజెంట్‌ షాదాబ్‌ను 20 లక్షల వరకు మోసగించారనే ఆరోపణలపై ఈ ముగ్గురిపై మహారాష్ట్రలోని ఔరంగబాద్‌ పోలీసుస్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

దీనిపై మహారాష్ట్ర పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా, ఈ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదని అజారుద్దీన్‌ చెప్పుకొచ్చారు. తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తిపై వంద కోట్ల పరునష్టం దావా వేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఓ వీడియో ద్వారా తన సందేశాన్ని విపింపించారు. ఈ కేసు విషయంలో న్యాయనిపుణులను సంప్రదించి తదుపరి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కాగా, ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టులు చేయలేదు.

Next Story