బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నాపై మ‌రో కేసు న‌మోదు

By సుభాష్  Published on  17 Oct 2020 10:42 AM GMT
బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నాపై మ‌రో కేసు న‌మోదు

బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా రనౌత్‌పై మ‌రో కేసు న‌మోదైంది. మ‌త‌ప‌ర‌మైన అస‌మ్మ‌తిని సృష్టించేలా ట్వీట్ చేసినందుకు కేసు నమోదు చేయాల‌ని ముంబై కోర్టు పోలీసుల‌ను ఆదేశించింది. ప్ర‌జ‌ల మ‌ధ్య విబేధాలు సృష్టించేలా కంగ‌నా అభ్యంత‌క‌ర‌మైన ట్వీట్ చేశారంటూ ఓ వ్య‌క్తి కోర్టును ఆశ్ర‌యించారు. స‌ద‌రు వ్య‌క్తి ఫిర్యాదును స్వీక‌రించిన కోర్టు.. ఆమెపై కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశించింది.

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతిపై మ‌హారాష్ట్ర పోలీసులు, కేంద్ర ద‌ర్యాప్తు బృందాలు విచార‌ణ చేస్తున్న స‌మ‌యంలో ప్ర‌జ‌ల్లో అనుమానాలు క‌లిగేలా వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల‌తో పాటు ముంబైని పాక్ అక్ర‌మిత క‌శ్మీర్‌గా పోలుస్తూ ప్ర‌జ‌ల మ‌ధ్య వివాదాలు సృష్టించేలా కంగ‌నా ట్వీట్ చేసింద‌ని స‌ద‌రు వ్య‌క్తి పేర్కొన్నారు.

ఈ నేప‌థ్యంలో కంగ‌నా ర‌నౌత్ , ఆమె సోద‌రి రంగోలిపై దేశ ద్రోహం కింద కేసు న‌మోదు చేయాన‌లి ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిట‌న్ కోర్టు ఆదేశించింది. ఇక కోర్టు ఆదేశం మేర‌కు ముంబై పోలీసులు కంగనాపై దేశ ద్రోహం కింద ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.

Next Story