ఈ ఫాస్టాగ్ భలే స్లొ గురూ..!

By Newsmeter.Network  Published on  30 Dec 2019 4:04 AM GMT
ఈ ఫాస్టాగ్ భలే స్లొ గురూ..!

హైదరాబాద్‌: ఫాస్టాగ్ ఎందుకోసం? ప్రజల వాహనాలు టోల్ గేట్ల దగ్గర ఎలాంటి సమస్యా లేకుండా త్వరగా వెళ్లడం కోసం. కానీ జరుగుతున్నదేమిటి? ఇప్పటికీ 52 శాతం మంది పాత పద్ధతిలో టోల్ చెల్లించి, వెళ్తున్నారు తప్ప ఫాస్టాగ్ కౌంటర్ల వద్దకి పోవడం లేదు. ఇప్పటికి తెలంగాణలో కేవలం 72,000 వాహనాలు మాత్రమే ఫాస్టాగ్ ను కొనుగోలు చేశాయి. మిగతా వాహనాలు పాత పద్ధతిలోనే టోల్ గేట్ వద్ద ఆగి, డబ్బు చెల్లించి వెళ్తున్నాయి.

టోల్ గేట్ల నిర్వాహకులు కూడా 25 శాతం లేన్లను హైబ్రిడ్ లేన్లుగా ఉపయోగిస్తున్నారు. కొన్ని ఫాస్టాగ్ లేన్లు, కొన్ని నాన్ ఫాస్టాగ్ లేన్లు కూడా ఉన్నాయి. హైబ్రిడ్ లేన్లలో ఫాస్టాగ్ ఉన్నా లేకున్నా అనుమతిస్తున్నారు. ఈ పద్ధతి జనవరి 14 వరకూ అమలు లో ఉంటుంది. ఆ తరువాత కేవలం ఫాస్టాగ్ లేన్లే ఉంటాయని అధికారులు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితే కొనసాగితే రానున్న రోజుల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా లేన్లన్నిటిలో విపరీతమైర రష్ ఉండబోతోంది. గంటల పాటు చెక్ పోస్టుల దగ్గర ఆగాల్సిన పరిస్థితి ఉండబోతోంది.

అయితే ఇక్కడ ఇంకో తమాషా ఉంది. ఫాస్టాగ్ ఉన్న కార్లు కేవలం 48 శాతమే అయినా, వాటి నుంచి వస్తున్న ఆదాయం మాత్రం చాలా ఎక్కువ. 60 శాతం టోల్ వసూళ్లు ఫాస్టాగ్ కార్ల నుంచే వస్తున్నాయి. మామూలు కార్లు 58 శాతం ఉన్నా వాటి నుంచి వస్తున్న ఆదాయం మాత్రం మొత్తం వసూళ్లలో 40 శాతం మాత్రమే.

Next Story
Share it