కొద్ది రోజులుగా, ఒక మనిషి అత్యంత హేయంగా జింక ను చంపుతున్న వీడియో ట్విట్టర్, ఫేస్ బుక్ లలో చక్కర్లు కొడుతోంది. అందులో జింక ను చంపుతున్న వ్యక్తి అటవీ శాఖ అధికారి అని ప్రచారం జరుగుతోంది. ట్విట్టర్ లో కొందరు, అటవీ శాఖా అధికారులను ట్యాగ్ చేసి ఆ వీడియోలో ఉన్న వ్యక్తులు ఎవరు అని ప్రశ్నలు సంధించారు.

హెచ్చరిక: హేయమైన వీడియో. జాగ్రత్త వహించండి

రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో, ఎటువంటి శబ్దాలు లేవు. కంచె వేసి ఉన్న ప్రాంగణంలో ఒక వ్యక్తి తుపాకీతో జింకను కాల్చి, తరువాత దాని గొంతు కోసి చంపేస్తాడు. తరువాత, ఘనకార్యం చేసినట్టుగా చచ్చిన జింకతో కామెరా కి ఫోసులు ఇస్తాడు.

హెచ్చరిక: హేయమైన వీడియో. జాగ్రత్త వహించండి

আজকে একটা প: ব: ফরেস্ট অফিসার একটা হরিণ কে মেরে দিল। এই ভিডিও টা চারিদিকে ছড়িয়ে দিন যাতে জেল হয়

Posted by Arkita Rai Sengupta on Friday, October 25, 2019

ట్విట్టర్ లో అటవీ శాఖా అధికారి, ప్రవీన్ కాస్వన్ ను ట్యాగ్ చేస్తూ వీడియోను షేర్ చేయగా, ఆ వీడియోలోని వ్యక్తి బాంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ కి చెందిన మోయిన్ ఉద్దిన్ అని, అది మన దేశానిది కాదనీ సమాధనం ఇచ్చారు అయన.

నిజ నిర్ధారణ:

మోయిన్ ఉద్దిన్, బాంగ్లాదేశ్ అనే పదాలను వాడుతూ, న్యూస్ మీటర్ టీం ఈ వీడియో వివరాలను పరిశోధించింది. రివర్స్ ఇమేజ్ సేర్చ్ చేసి చూడగా, ఈ వీడియో 2015 సంవత్సరానికి చెందినది అని తెలుస్తోంది. మయిన్ ఉద్దిన్, తన ఫేస్ బుక్ ఖాతా లో జూలై 4, 2015 న అప్లోడ్ చేసాడు. బాంగ్లాదేశ్ లో పుట్టిన మొయిన్ ఉద్దిన్, ఆస్ట్రేలియా లో నివసిస్తున్నాడు. చిట్టగాంగ్ లో ఆయనకి ఉన్న పెద్ద ఫార్మ్ లో జింకను కాల్చి చంపాడు, అదే కామెరా లో రికార్డ్ అయ్యింది.
బాంగ్లాదేశ్ కి చెందిన న్యూస్ పేపర్, డైలీ స్టార్ లో ఈ ఉదంతం గురించి రిపోర్ట్ చేశారు. జూలై 12, 2015న “హూ ఇస్ థ బీస్ట్ ” అంటూ ఒక ఆర్టికల్ ప్రచురించారు.

https://www.thedailystar.net/frontpage/who-the-beast-111106

జూలై 11, 2015న డైలీ స్టార్ యూట్యూబ్ చానల్ లో అధిక నిడివి గల అదే విడియో అప్లోడ్ చేశారు. అందులో ఉన్నవారి మాటలు వినవచ్చు. అందులో, బాంగ్లాదేశీ ప్రాంతీయ భాష వాడుక ను వినవచ్చు. మోయిన్ ఉద్దిన్ ఫేస్ బుక్ పేజి నుంచి వీడియోను తీసుకున్నామని ఉంది.

హెచ్చరిక: హేయమైన వీడియో. జాగ్రత్త వహించండి

డైలీ స్టార్ లో ఆర్టికల్ ప్రచురించిన తరువాత మోయిన్ ఉద్దిన్ తన ఫేస్ బుక్ లో అధికారికంగా వివరణ ఇచ్చాడు. 2006 నుంచి తోటలను పెంచుతున్నాననీ, 102 ఆవులూ, 800 మామిడి చెట్లూ, 50,000 కలప చెట్లూ పెంచుతున్నాననీ చెప్పాడు.

I am a Bangladeshi born Australian. I have read the article of the Daily Star, “Who is the beast?” and it deeply shocked…

Posted by Moin Uddin on Monday, July 13, 2015

ప్రచారం లో ఉన్నది: వైరల్ గా మారిన జింక ను చంపే వీడియో వెస్ట్ బెంగాల్ లోనిది

ప్రచారం చేసినది: ట్విట్టర్, ఫేస్ బుక్ మాధ్యమాలలో

నిజ నిర్ధారణ: అబద్దం. ఈ విడియో 2015 సం వత్సరానికి చెందినది. ఇది బాంగ్లాదేశ్ లో పుట్టి ఆస్ట్రేలియా లో నివసిస్తున్న మోయిన్ ఉద్దిన్ అనే వ్యక్తిది.

సత్య ప్రియ బి.ఎన్