నార్సింగ్‌లో కాల్పులు.. మాజీ ఆర్మీ ఉద్యోగి అరెస్ట్‌

By సుభాష్  Published on  29 Aug 2020 2:44 AM GMT
నార్సింగ్‌లో కాల్పులు.. మాజీ ఆర్మీ ఉద్యోగి అరెస్ట్‌

హైదరాబాద్‌ నార్సింగ్‌ హైదర్ష్‌ కోటలో కాల్పుల ఘటన కలకలం రేపింది. వినాయక నిమజ్జనం చేసే సమయంలో మాజీ ఆర్మీ అధికారి నాగ మల్లేష్‌ గాల్లోకి కాల్పులు జరిపారు. గణేష్‌ నిమజ్జనం సందర్భంగా హైదర్‌ షాకోట్‌ రోడ్డులో ఉన్న శివ హైలెట్స్‌ అపార్ట్‌మెంట్లో ఈ మాజీ ఆర్మీ ఉద్యోగం సంచలనం సృష్టించాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఇంటిపైన హై రీచ్‌ ఇంటర్నెట్‌ సిబ్బంది మందు పార్టీ చేసుకుంటున్నారు. పలు మార్లు చెప్పినా కూడా పట్టించుకోకపోవడంతో వారిని భయపెట్టేందుకు సదరు ఆర్మీ జవాను గాల్లో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కాల్పులకు మందు పార్టీ కారణమని తెలుస్తోంది. వారికి పలు మార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, అందుకే కోపంతో నాగ మల్లేష్‌ కాల్పులు జరిపినట్లు సమాచారం. ఇక ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it