ఈఎస్‌ఐ స్కాంలో మరో ముగ్గురు అరెస్ట్

 Published on  7 Oct 2019 11:23 AM GMT
ఈఎస్‌ఐ స్కాంలో మరో ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్ : ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతూనే ఉంది. మరోముగ్గురిని ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. స్కాంలో కీలకపాత్ర పోషించారని చెప్పుకుంటున్న ముగ్గురిని అధికారులు అరెస్ట్ చేశారు. డాక్టర్ అరవింద్ రెడ్డి, కె. రామ్‌ రెడ్డి, కె. లిఖిత్ రెడ్డిలను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈఎస్‌ఐకి పరికరాలు సరఫరా చేసినట్లు చూపించి డాక్టర్‌ అరవింద్ రెడ్డి డబ్బులు కాజేసినట్లు అధికారులకు ఆధారాలు దొరికాయి. జాయింట్ డైరక్టర్ పద్మతో కలిసి అరవింద్ రెడ్డి అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. 2013 నుంచి డాక్టర్ అరవింద్ రెడ్డి ఈఎస్‌ఐ నిధులను కాజేసినట్లు అధికారులు గుర్తించారు. ఈఎస్‌ఐ స్కాంలో ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వారి సంఖ్య 13కు చేరుకుంది.

అయితే..ఏసీబీ అధికారుల వివరణ, సోదాలు, అరెస్ట్ లపై కొంత మంది రాజకీయ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఈఎస్ఐ స్కాంలో బిగ్ ఫిష్ లు ఉన్నాయని వాటిని పట్టుకోవాలని కమ్యూనిస్ట్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఈఎస్ఐ స్కాంను ఏసీబీ చాలా చిన్నది చేసి చూపిస్తుందని...కుంభకోణం కోట్ల రూపాయలలో ఉంటుందని వారంటున్నారు. దేవికా రాణితోపాటు అరెస్ట్ అయిన వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాలని వారు కోరుతున్నారు. ఏసీబీ అధికారులు పనితీరు సరిగాలేకపోతే సీబీఐని ఆశ్రయిస్తామంటున్నారు రాజకీయ నేతలు.

Next Story
Share it