హైదరాబాద్ : ఈఎస్‌ఐ స్కాంలో మరొకరిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. సనత్ నగర్ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో పార్మసిస్ట్‌గా పని చేస్తున్న నాగలక్ష్మీని అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న అరెస్ట్ చేసిన లైఫ్ కేర్‌ డ్రగ్స్ సుధాకర్‌ రెడ్డితో కలిసి నాగలక్ష్మీ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. పెద్దమొత్తంలో మందుల కొనుగోళ్లకు సంబంధించి నాగలక్ష్మీ పాత్ర ఉందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఎనిమిదిన్నర కోట్ల మందుల కుంభకోణంలో నాగలక్ష్మీ పాత్ర ఉందంటున్నారు. నాగలక్ష్మీని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు రిమాండ్‌కు తరలించారు.

ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని అరెస్ట్ చేశారు. సుధారాణి సహా మరో ఆరుగురికి కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్ట్. ఏసీబీ అధికారులు చెబుతున్నదానికంటే పెద్ద మొత్తంలోనే  అక్రమాలు జరిగినట్లు  కమ్యూనిస్ట్ పార్టీ నేతలు  ఆరోపిస్తున్నారు. ఏసీబీకి కాకుండా ఈఎస్ఐ స్కాంను సీబీఐకి అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.