నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘ఎంత మంచివాడవురా’.  క‌ళ్యాణ్ రామ్ త‌న 17వ చిత్రంగా ఎంత మంచివాడ‌వురా అనే చిత్రంతో ముందుకొస్తున్నాడు. సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అయితే  తెలుగు ఇండస్ట్రీలో  ప్రస్తుతం ఫ్యామిలీ చిత్రాల  దర్శకుడిగా బలంగా ముద్ర పడిపోయాడు  ‘సతీష్ వేగేశ్న’.  ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు  చక్కని రిలేషన్ ను అలాగే   జీవితానికి సంబంధించి అంతర్లీనమై సందేశాలను బాగా ఎలివేట్ చేసే సతీష్ వేగేశ్న..  ‘ఎంత మంచివాడవురా’ సినిమాతో  తన శైలిని మార్చుకున్నాడు. ఈ సారి ఎమోషనల్  ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌కు బలమైన యాక్షన్ డ్రామాను కూడా జోడించాడు.  ఈ సంక్రాంతి సీజన్ లో  స్టార్ హీరోల సినిమాలకు గట్టి పోటీ ఇవ్వడం కోసం అన్ని వర్గాల ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ.. ‘ఎంత మంచివాడవురా’ను  ఆల్ ఎమోషన్స్ తో పాటుగా  పక్కా కమర్షియల్ ఫ్యామిలీ  ఎంటర్ టైనర్ తీర్చదిద్దాడట.

కాగా  ఈ సినిమాలో మాస్ అప్పీల్‌ ని రివీల్ చేయడానికి.. ఇప్పటికే  టీజ‌ర్ లో యాక్ష‌న్ డోస్ బాగానే చూపించాడు. రీసెంట్ గా వదులుతున్న పోస్ట‌ర్స్  లో కూడా మాస్ ను ఆకట్టుకునే విధంగా హీరో పోస్టర్స్ లో  హీరోయిజంను గట్టిగానే చూపిస్తున్నాడు. మొత్తానికి సతీష్ వేగేశ్న ఈ చిత్రంతో తన స్టైల్ మార్చాడు. ఎలాగూ క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే సతీష్.. ఈసారి మాస్ ఆడియన్స్ ను కూడా ఆ స్థాయిలోనే ఆకట్టుకుంటాడేమో.. అన్నట్లు ఈ సినిమాకి హైప్ తీసుకురావడానికి ఎన్టీఆర్ రంగంలోకి దిగాడు. ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ హాజరయ్యాడు. అయితే ఎన్టీఆర్ ముఖ్య అథితిగా రాబోతున్నాడని పోస్టర్ ను రిలీజ్ చేసిన వెంటనే.. ఈ చిత్రం ట్రెండింగ్ లిస్ట్ లోకి వెళ్ళింది.  అప్పటివరకూ ట్రెండ్ లో లేని ఈ సినిమా.. ఎన్టీఆర్ స్టార్ డమ్ దెబ్బకు  ట్రెండ్ అవ్వడం విశేషమే.

ఈపాటికే ఈ సినిమా టీచర్‌,  ట్రైలర్‌ కూడా విడుదల చేయగా, అందుకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే  సినిమా బ్లూపర్‌ వీడియో కూడా విడుదల చేశారు మేకర్స్‌ . ఇక సినిమా షూటింగ్‌ సమయంలో ఆర్టిస్టుల మధ్య జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ లను వీడియో రూపంలో విడుదల చేశారు కూడా. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది 15 తేదీ వరకు వేచి చూడాల్సిందే.

ఇక ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో  కళ్యాణ్ రామ్ సరసన  మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా నటించింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.