బ్రేకింగ్: ఏపీ, తెలంగాణలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.6 నమోదు..!

By సుభాష్  Published on  26 Jan 2020 2:45 AM GMT
బ్రేకింగ్: ఏపీ, తెలంగాణలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.6 నమోదు..!

ఏపీ, తెలంగాణలో ఆదివారం అర్ధరాతి 2:36 గంటలకు భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.6గా నమోదైనట్లు తెలుస్తోంది.

ఏపీలో తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలతో పాటు నందిగామ, బెల్లంకొండ, వెంకటాయపాలెం, క్రోనూరు, పిడుగురాళ్లు, మాచవరం, తుళ్లూరు తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి.

Earthquake

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రం, కోదాడ, హుజూర్నగర్, మేళ్ల చెరువు, చింతలపాలె, పాలకీడు, మఠంపల్లి మండలంలో సుమారు 50 సెకన్ల పాటు భారీ శబ్దాలతో 7 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయ బ్రాంతులకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఈ భూ ప్రకంపనలతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కిందపడిపోయాయని చెబుతున్నారు. దీంతో నిద్రలేకుండా రోడ్లపైనే గడిపామని ప్రజలు తెలిపారు.

Earthquake Ts

Next Story