భూమిపై అతి పురాతనమైన అంతరిక్ష వస్తువు ఇదే

By Newsmeter.Network  Published on  14 Jan 2020 1:19 PM GMT
భూమిపై అతి పురాతనమైన అంతరిక్ష వస్తువు ఇదే

  • 750 కోట్ల సంవత్సారాలకు పైగా వయసున్న వస్తువు
  • భూమిమీద ఇదే అత్యంత పురాతనమైన వస్తువు
  • నక్షత్రాల జీవిత కాలం ముగిస్తే పుట్టే కొత్త వస్తువులు
  • అంతరిక్షంలోకి జారిపోయే వింత వస్తువులు
  • అరవయ్యో దశకంలో భూమిమీద పడ్డ విచిత్ర వస్తువు
  • 1969లో ఆస్ట్రేలియాలో ఈ వస్తువు గుర్తింపు
  • 750 కోట్ల సంవత్సరాల పూర్వం పుట్టిన గెలాక్సీ అవశేషం

750 కోట్ల సంవత్సారాలకు పైగా వయసున్న ఓ విచిత్రమై వస్తువు శాస్త్రవేత్తలు భూమి మీద కనుగొన్నారు. అవును. మీరిప్పుడు తెలుసుకుంటున్నది నిజమే. ఇదే ఆ అతి పురాతనమైన, విచిత్రమైన వస్తువు. బహుశా ఈ వస్తువు అంతరిక్షంనుంచి భూమిమీద అరవయ్యో దశకంలో పడి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

అసలు సూర్య మండలం ఏర్పాటు కావడానికంటే ముందే నక్షత్ర రాశుల్లో ఏప్పడిన ధూళికళాలు ఒక్కటిగా ఒక చోటికి చేరి ఈ వస్తువు తయారై ఉంటుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ రీసెర్చ్ జర్నల్ లో దీని గురించి పూర్తి వివరాలను ప్రచురించారు.

నక్షత్రాల జీవితకాలం ముగిసిపోయినతర్వాత అవి అంతమైపోయే సమయంలో వాటిలో ఉన్న వస్తువులు, పదార్ధాలు అంతరిక్షంలోకి జారిపోతాయి. ఆ చిన్నచిన్న భాగాలే మళ్లీ కొత్త నక్షత్రాలుగా, గ్రహాలుగా, చంద్రగోళాలూ, మరికొన్ని ఇతర వస్తువులూ ఏర్పడతాయని సైంటిస్టులు చెబుతున్నారు. నక్షత్రాలకు, స్టార్ డస్ట్ కీ ఇది కచ్చితమైన ఉదాహరణ అంటున్నారు.

దాని నుంచి విచిత్రమైన కాంతి కిరణాలు ప్రసరించే అవకాశం ఉందని, దీనిలో అంతరిక్షంలో ఉండే నీరుకూడా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీన్ని పరిశోధించిన తర్వాత అంతరిక్ష జ్ఞానానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సైంటిస్తులు చెబుతున్నారు.

1969లో అంతరిక్షం నుంచి ఆస్ట్రేలియా భూభాగంలో పడిన ఈ వస్తువుపై అమెరికాకు చెందిన, స్విట్జర్లాండ్ కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. దీన్ని లోతుగా పరిశీలించగా సౌరకుటుంబం ఆవిర్భానికి ముందున్న 40 రకాల అవశేషాలు, స్టార్ డస్ట్ దీనిలోని ఒక భాగంలో ఉన్నట్టుగా వారంతా గుర్తించారు.

దానిలోని భాగాలన్నింటినీ విడదీసిన తర్వాత అనింటినీ కలిపితే అది కుళ్లిపోయిన పీనట్ బట్టర్ లాగా కనిపించిందనీ, వాసన వచ్చిందనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వింత పేస్టుని యాసిడ్ లో కరిగించినప్పుడు పూర్తిగా స్టార్ డస్ట్ మాత్రమే మిగిలిందంటున్నారు. అంతరిక్షంలో అవి ఎంతకాలంపాటు కాస్మిక్ రేస్ తో అనుసంధానమై ఉన్నాయన్న విషయాన్ని పరిశోధనల్లో గుర్తించే ప్రయత్నం చేసినప్పుడు అవి ఎంత పురాతనమైనవో తెలిసిందని సైంటిస్టులు చెబుతున్నారు.

ఆ వస్తువులోని కొన్ని భాగాలను మాత్రం భూమి పుట్టుకకంటే పురాతనమైనవిగా గుర్తించగలిగామనీ, మిగతా భాగాలన్నీ ఆ తర్వాత పుట్టినవేననీ శాస్త్రవేత్తలు విశదీకరించారు. ఏడు వందల యాభై కోట్ల సంవత్సరాలకు పూర్వం పుట్టిన గెలాక్సీకి సంబంధించిన అవశేషాలను పరిశీలించే అవకాశం కలగడం నిజగా చాలా థ్రిల్ గా ఉందని చెబుతున్నారు.

Next Story