మా పై దాడి చేస్తే సహించేది లేదు
By Newsmeter.Network
కాకినాడ : టిడిపితో పొత్తుతో ఉన్న పవన్ కాపులకు ఏనాడు మద్దత్తుగా నిలబడలేదని కాకినాడ ఎమ్యెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. పవన్ కళ్యాణ్ కాకినాడ వస్తున్నారని తెలిసి కొందరు నిన్న ఆస్పత్రికి వెళ్లారన్నారు. జనసేన కార్యకర్తలపై దాడి జరిగిందని పవన్ పరామర్శించేందుకు వచ్చారు చాలా సంతోషం.. ముద్రగడ పద్మనాభం ఆయన కుటుంబంపై చంద్రబాబు అరాచకంగా దాడి చేయిస్తే పవన్ కనీసం సానుభూతి తెలపలేదని ఆరోపించారు.
టిడిపితో పొత్తుతో ఉన్న పవన్ కాపులకు ఏనాడు మద్దత్తుగా నిలబడలేదని, నా వ్యాఖ్యలు బాధిస్తే గతంలో చంద్రబాబు ఆయన పార్టీ నేతలు ఇంతకన్నా దారుణంగా మాట్లాడారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తిని దూషిస్తే ఎలా ఉంటుందో చెప్పాలనే అలా మాట్లాడానని చెప్పారు. నేను వెనక్కి తగ్గేదే లేదు, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. మీ వ్యవహారం భాష మారితేనే నేను మారతాను.. చంద్రబాబు లాంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడం సరికాదని సూచించారు.
రాబోయే రోజుల్లో మాపై దాడి చేస్తే సహించేది లేదు. పవన్ ఏ పార్టీతో అయినా నేరుగా పొత్తు పెట్టుకోవాలని, రహస్య ఒప్పందాలు వద్దన్నారు. ఇప్పుడు బిజేపితో పొత్తు అని ప్రచారం జరుగుతోంది.. మంచి నిర్ణయం డైరెక్ట్ గా పొత్తు పెట్టుకోవడం మంచిదే.. రాష్ట్రంలో జగన్ తర్వాత ఆదరణ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ నే అని అన్నారు.