టీఆర్ఎస్ నాయ‌కుల ఇళ్ల‌ల్లో పోలీసుల సోదాలు

By సుభాష్  Published on  31 Oct 2020 7:18 AM GMT
టీఆర్ఎస్ నాయ‌కుల ఇళ్ల‌ల్లో పోలీసుల సోదాలు

దుబ్బాక ఉప ఎన్నిక వేడి అంతా ఇంతా కాదు. ఇరు పార్టీల ఘ‌ర్ష‌ణ‌లు, ఆందోళ‌న‌లతో ప్ర‌చారాలు కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా శ‌నివారం పోలీసులు టీఆర్ ఎస్ నాయ‌కుల ఇళ్ల‌ల్లో సోదాలు చేప‌ట్టారు. ఏక‌కాలంలో 8 మంది టీఆర్ ఎస్ నేత‌ల ఇళ్ల‌ల్లో సోదాలు నిర్వ‌హిస్తున్నారు పోలీసులు. దుబ్బాక జ‌డ్పీటీసీ ర‌వీంద‌ర్‌రెడ్డి, ఎంపీపీ పుష్ప ల‌త కిష‌న్‌రెడ్డి, దుబ్బాక మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ బండి శ్రీ‌లేఖ రాజు, ఆర్య వైశ్య స‌మాజ అధ్య‌క్షుడు చింత రాజు, సిద్దిపేట టీఆర్ ఎస్ పార్టీ ప‌ట్టణ‌ అధ్య‌క్షుడు కొండం సంప‌త్ రెడ్డి త‌దిత‌ర ఇళ్ల‌ల్లో పోలీసులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు.

Next Story