''దొంగ'' సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన కార్తీ

By రాణి  Published on  16 Dec 2019 12:51 PM GMT
దొంగ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన కార్తీ

హైదరాబాద్ : ఖైదీ చిత్రంతో ఎమోషనల్‌ బ్లాక్‌ బాస్టర్‌ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకున్న యాంగ్రీ హీరో కార్తీ హీరోగా న‌టించిన తాజా చిత్రం దొంగ‌. దృశ్యం ఫేమ్‌ జీతు జోసెఫ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హించారు. ఈ సినిమాను తెలుగులో హర్షిత మూవీస్‌ పతాకంపై నిర్మాత రావూరి వి. శ్రీనివాస్‌ అందిస్తున్నారు. దొంగ సినిమా డిసెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ పార్క్‌హయాత్‌ హోటల్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను ఏర్పాటు చేశారు.

ఈ వేడుక‌లో కార్తీ మాట్లాడుతూ... దొంగ క‌థ ఎలా ఉంటుందో చెప్పేశారు. ఇంత‌కీ కార్తీ ఏం చెప్పారంటే.. ''ఖైదీ తర్వాత దొంగ ఏంటి ? అని అందరూ అడుగుతున్నారు. ఈ రెండు చిరంజీవి గారికి పెద్ద హిట్‌ ఇచ్చిన టైటిల్స్‌. ఎలాగైతే స్క్రిప్ట్‌కి తగ్గట్లు ఖైదీ అని పెట్టామో.. ఈ సినిమాకి కూడా అలానే దొంగ అని టైటిల్‌ పెట్టడం జరిగింది. ఈ సినిమా కథ వినేటప్పుడు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. అలాగే అక్క, తమ్ముడు రిలేషన్ షిప్ ఇంట్రెస్టింగ్‌గా, ఎమోషనల్‌గా అనిపించింది. మా నాన్న క్యారెక్టర్‌ సత్యరాజ్‌ గారు చేశారు. ఈ మూడు క్యారెక్టర్స్ సినిమాకి పిల్లర్స్‌ లాంటివి.

దృశ్యం లాంటి సినిమాని తెరకెక్కించిన స్ట్రాంగ్‌ డైరెక్టర్‌ జీతూ జోసెఫ్‌ గారు ఈ సినిమాకి వర్క్‌ చేస్తున్నారు అనగానే మా అందరిలో కాన్ఫిడెన్స్‌ పెరిగింది. సత్యరాజ్‌ గారు డబ్బింగ్‌ చెప్పేటపుడు ఇది దృశ్యం 2 అనిపిస్తుంది'' అన్నారు కార్తీ. ఇదొక బ్యూటిఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌. షావుకారి జానకి, సీత గారి క్యారెక్టర్‌ కూడా కీలకంగా ఉంటాయి. 96 సినిమాకు చేసిన గోవింద్‌ వసంత గారు అద్భుతమైన సంగీతం, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు. ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుందన్నారు.

నా పేరు శివ, ఊపిరి కలిపితే వచ్చిన డిఫరెంట్‌ ఫిలింలా ఈ సినిమా ఉంటుందట. ''ఊపిరి సినిమాలో శీనూ క్యారెక్టర్‌ నాకు చాలా స్పెషల్‌. ఎక్కడికి వెళ్లినా ఎయిర్‌ పోర్ట్‌లో వీల్‌చైర్‌లో ఉన్నవారు నన్ను పిలిచి ఫోటో తీసుకుంటారు. చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంటుంది. క్రిస్మస్‌కి, న్యూ ఇయర్‌కి ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేసే హాలిడే మూవీ. తప్పకుండా థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూడండి. మా నిర్మాత రావూరి వి. శ్రీనివాస్ గారు సినిమా మీద ఫ్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చారు. తెలుగులో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయనకు పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను'' అని కార్తీ అన్నారు.

Next Story
Share it