డీకే అరుణ అరెస్ట్‌

By సుభాష్  Published on  17 Oct 2020 11:26 AM GMT
డీకే అరుణ అరెస్ట్‌

నాగ‌ర్ క‌ర్నూలు జిల్లా కొల్లాపూర్ మండ‌లం ఎల్లూరు వ‌ద్ద నీట మునిగిన కేఎల్ ఐ ప్రాజెక్టు మోటార్ల‌ను ప‌రిశీలించ‌డానికి వెళ్తున్న బీజేపీ జాతీయ ఉపాధ్య‌క్షురాలు డీకే అరుణ‌ను వ‌న‌ప‌ర్తి జిల్లా పెబ్బేర్ వ‌ద్ద పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోలీసుల‌కు.. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుకోవ‌డంతో అరుణ ఆగ్ర‌మం వ్య‌క్తం చేస్తూ కారు దిగి రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. మంత్రుల‌ను అనుమ‌తించిన పోలీసులు.. త‌మ‌ను ఎందుకు అనుమ‌తించ‌డం లేద‌ని ఆమె మండిప‌డ్డారు. ప్ర‌స్తుతం పెబ్బేరులో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అరుణాతోపాటు ప‌లువురు బీజేపీ నేత‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story