దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం చాలా బాధాకరం అని ఆలేరు టీఆరెస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లా ఆలేరులోని ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యాలు చేశారు. దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం వలన వారి కుటుంబ సభ్యులు చాల బాధపడి ఉంటారన్నారు. ఈ సందర్భంగా నిందితుల కుటుంబాలకు తన సానుభూతి తెలిపారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ను అందరు సమర్దిస్తుంటే.. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే సునీత వ్యాఖ్యలు అందరిని ఆశ్ఛర్యానికి గురి చేశాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే ఈ విధంగా తప్పు చేసిన నిందితులకు శిక్ష పడటాన్ని బాధాకరంగా బావిచడం సరి కాదని ప్రజలు భావిస్తున్నారు.

ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై పార్టీ  హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి..!

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.