సస్పెన్స్ గా ‘డిస్కోరాజా’ టీజర్

By Newsmeter.Network  Published on  13 Jan 2020 1:12 PM GMT
సస్పెన్స్ గా ‘డిస్కోరాజా’ టీజర్

మాస్ మహారాజా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డిస్కోరాజా’. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్ ను విడుదల చేశారు. సోల్జర్స్ సంవత్సరాలపాటు బాంబింగ్స్ తో, ఫైరింగ్స్ తో యుద్దాలు చేసి.. వేటాడే ఇంట్లో ఉంటే సడెన్ గా వచ్చే సైలెన్స్ ఉంటుంది చూడూ అంటూ సాగే సంభాష‌ణ‌ల‌తో టీజ‌ర్ మొద‌ల‌వుతుంది. ఈ టీజర్‌లో విలన్ పాత్రను పరిచయం చేశారు. ఈ సినిమాలో విలన్ పాత్ర పేరు సేతు. ఇప్పటి వరకు తమిళ సినిమాల్లో విలన్‌గా అలరించిన తెలుగు నటుడు బాబీ సింహా.. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ‘‘సేతు అంటే గుర్తుకు రావాల్సింది వయసు కాదు, భయం.. భయం గుర్తుకురావాలి’’ అంటూ బాబీ సింహా చెప్పే డైలాగ్ టీజర్‌లో హైలైట్‌ అవుతోంది. ఇక ఆ తరవాత రవితేజ ఎంట్రీ అదిరిపోయింది.

టీజర్లు చూస్తుంటే ఈ సినిమాలో రవితేజ చాలా కొత్తగా కనిపించనున్నట్టు అర్థమవుతోంది. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ‘‘ఎనీవన్ ఎల్స్.. వాన్నా డ్యాన్స్ విత్ మి?’’ అనే డైలాగ్ చెప్పి హెడ్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్‌కి డ్యాన్స్ చేస్తూ గన్‌తో విలన్‌ను కాల్చుతూ ‘‘ఐ లవ్ ఫ్రీకింగ్ ఫియర్ ఇన్ యువర్ ఐస్’’ అని రవితేజ చెప్పే డైలాగ్‌తో టీజర్ ముగిసింది. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్య హోప్ హీరోయిన్లుగా నటించారు. బాబీ సింహా ప్రతినాయకుడి పాత్ర పోషించారు. వెన్నెల కిషోర్, సత్య ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రజిని తాళ్లూరి నిర్మిస్తున్నారు. జనవరి 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story
Share it