ట్రైలర్ క్లిక్ అయితేనే.. 'డిస్కో రాజా'కి మార్కెట్ !

By రాణి  Published on  30 Dec 2019 12:45 PM GMT
ట్రైలర్ క్లిక్ అయితేనే.. డిస్కో రాజాకి మార్కెట్ !

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ డైరెక్షన్ లో 'డిస్కో రాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ ఆశలన్నీ ఈ సినిమా పైనే. ఆయన అభిమానులు సైతం ఈ సినిమా ద్వారా తమ హీరో మునుపటి ఫామ్ లోకి వస్తాడని ఆశిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మనాలీలో జరుగుతుంది. అయితే చిత్ర టీమ్ ఈ సినిమా ట్రైలర్ ను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి ట్రైలర్ ను గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుండి వస్తున్న ట్రైలర్ మేజర్ ఔట్ పుట్ కావడంతో.. ఈ ట్రైలర్ అన్ని విధాలా ఆకట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

నిజానికి ఈ ట్రైలర్ కు వచ్చే ఆదరణను బట్టే.. బాక్సాఫీస్ వద్ద 'డిస్కో రాజా' భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ అయినా ఆశించిన స్థాయిలో ప్రేక్షుకుల నుండి టీజర్ కి ఆదరణ దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న డిస్కో రాజాకి మార్కెట్ ఉండాలంటే ట్రైలర్ చాలా కీలకం కానుంది. మరి ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాని 2020 జనవరి 24న రవితేజ పుట్టినరోజు కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

కాగా ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత రామ్‌ తాళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యాహోప్ మెయిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే రవితేజ డ్యూయల్ రోల్‌ లో నటిస్తుండగా బాబీ సింహ విలన్ గా కనిపించనున్నారు. తమన్ మ్యూజిక్, ఆబ్బూరి రవి డైలాగ్స్, కార్తీక్ ఘట్టమనేని గ్రాండియర్ విజువల్స్ ఈ చిత్రానికి బాగా ప్లస్ అవుతున్నాయని మేకర్స్ ఫీల్ అవుతున్నారు. మరి ఎంతవరకు ఈ సినిమా రవితేజకి హిట్ ఇస్తుందో చూడాలి.

Next Story