హిట్ లేని డైరెక్టర్ కి  గొడవలు అవసరమా !

By సుభాష్  Published on  18 Jan 2020 7:30 AM GMT
హిట్ లేని డైరెక్టర్ కి  గొడవలు అవసరమా !

తన గత సినిమా 'రాక్ష‌సుడు'తో హిట్ అందుకున్న యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కందిరీగ‌, ర‌భ‌స, హైప‌ర్‌ ఫేమ్ సినిమాల డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతున్న సంగ‌తి తెలిసిందే. కాగా ప్రస్తుతం రెగ్యుల‌ర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్ డేట్ తెలిసింది. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌ వర్కింగ్ స్టైల్ కు, ఈ చిత్రానికి కెమెరామెన్ గా పనిచేస్తోన్న డూడ్లీ వర్కింగ్ స్టైల్ కి పొసగలేదట. కొన్ని షాట్స్ మేకింగ్ లో ఇద్దరికీ మధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌చ్చాయి. దాంతో డూడ్లీ ఈ చిత్రం నుండి తప్పుకున్నాడు. అయితే డూడ్లీ బాలీవుడ్‌లో 'చెన్నై ఎక్స్‌ ప్రెస్‌, సింగం' వంటి సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటో గ్రాఫ‌ర్‌ గా ప‌నిచేశారు. మరి టాలెంటెడ్ కెమెరామెన్ తో గొడవ ఏంటో.. ఎలాగూ సంతోష్ శ్రీనివాస్ హిట్ ట్రాక్ లో లేడు. ఇక ఈ గొడవలు అవసరమా.

కాగా బెల్లంకొండ శ్రీనివాస్ - సంతోష్ శ్రీనివాస్ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ కోసం డైరెక్ట‌ర్ సంతోష్ శ్రీనివాస్ యాక్షన్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు. మనోడు ఎంత యాక్షన్ సిద్ధం చేస్తే ఏం లాభం ? బెల్లంకొండకు ఎలాగూ ఆ యాక్షన్ సెట్ అవ్వదు. అయినా యాక్షన్ కావాలంటాడు. ఇక ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డబోతున్నాడు. సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై జి.సుబ్ర‌హ్మ‌ణ్యం ఈ సినిమాని నిర్మించ‌నున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. 'అల్లుడుశీను', 'జ‌య‌జానకి నాయ‌క‌' సినిమాల త‌ర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌, దేవిశ్రీ ప్ర‌సాద్ కలయికలో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్ర‌మిది.

Next Story
Share it